తిరుమల లడ్డూ వ్యవహారం ప్రకపంపనలు రేపుతోంది. ముఖ్యంగా ఈ వివాదలో వైసీపీ కార్నర్ అవుతోంది. అందరి వేళ్లు వైసీపీ వైపే చూపిస్తున్నాయి. వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు ఇదే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఆత్మ రక్షణలో పడింది. ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్రగా వైసీపీ అనుమానిస్తోంది.
అయితే పార్టీ ఆవిర్భావం నుంచి గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటుంది. జగన్లో సైతం ఒక రకమైన భయం కనిపిస్తోంది. తమ హయాంలో తప్పు జరగలేదని చెప్పేందుకు ఆయన పడుతున్న వ్యధ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఇటువంటి ఆరోపణలు వచ్చిన అప్పుడు దర్యాప్తును కోరతారు.
కానీ జగన్ మాత్రం పరుచు బీజేపీ పెద్దలు, సహిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, స్వామీజీలను గుర్తు చేసుకుంటూ విన్నపాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరోపణలు చేసింది ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు.. ల్యాబ్ నిర్ధారించిన తర్వాత తాను ఈ విషయం బయట పెట్టినట్లు చంద్రబాబు చెబుతున్నారు. అదే సమయంలో జగన్ సైతం సీబీఐతో కానీ.. సింగిల్ జడ్జ్ తో కానీ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్పష్టంగా ల్యాబ్ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఎలాంటి ఆధారాలు చూపాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
లడ్డూ వివాదం నేపథ్యంలో వైసీపీ ఢిపెన్స్ లో పడింది. ఏ రాజకీయ పార్టీ కూడా జగన్ కు అండగా నిలిచేందుకు సిద్ధంగా లేదు. అదే వస్తే హిందూ సమాజానికి దూరం అవుతామనే భావన ఆయా పార్టీలను వెంటాడుతోంది. ఇండియా కూటమి పార్టీలు సైతం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులకు నేరుగా లేఖలు రాస్తున్నారు జగన్. ఇది ఏపీ రాజకీయాల్లో భాగమని.. కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని అందులో పేర్కొంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి బయట పడే మార్గం జగన్ కు తెలియడం లేదు. దీంతో జగన్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నారు.