గత కొద్ది రోజులుగా హెజ్ బోల్లా పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. హెజ్ బోల్లా స్థావరంగా ఉన్న లెబనాన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. వైమానిక దాడులతో భీబత్సం సృష్టిస్తోంది. ఇటీవల వాకీ టాకీలతో బాంబులు పెట్టి హెజ్ బోల్లా కు చుక్కులు చూపించిన ఇజ్రాయెల్.. తాజాగా హెజ్ బోల్లా చీఫ్ హసన్ నస్రల్లా ను అంతమొందించింది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా తో పాటు ఆయన కుమార్తె చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిని ఆయా దేశాలు ధ్రువీకరిస్తున్నాయి కూడా. వీరద్దరి మృతిని హెజ్ బోల్లా , లెబనాన్ లు తీవ్రంగా పరిగణమిస్తున్నాయి. వీరి మృతి ఆయా సంస్థలకు తీరని లోటు. 1997లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో జైనబ్ సోదరుడు హదీ దుర్మరణం చెందారు. అప్పటి నుంచి జైనబ్ ఇజ్రాయెల్ పై మరింత కక్ష పెంచుకుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం చేసిన త్యాగం గురించి వివరించింది. హెజ్ బోల్లా ఏర్పాటు ఉద్దేశాన్ని వెల్లడించింది. ఇక అప్పటి నుంచి ఆమెను, ఆమె తండ్రిని ఇజ్రాయెల్ టార్గెట్ గా పెట్టుకుంది. చివరకు ఇన్నాళ్లకు వారిని అంతమొందించింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జైబన్, హసన్ మృతికి హెజ్ బోల్లా తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంది అని హెచ్చరిస్తున్నారు. దాడులు, బాంబులు తీవ్రతరం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
వీరికి ఇరాన్ అండగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. బీరూట్ పై ఇజ్రాయెల్ దాడి చేసి నస్రన్, అతని కూతురుని దాడి చేసి మట్టుబెట్టడంతో హెజ్ బోల్లా ప్రతీకారం మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకొని 65 రాకెట్లతో దాడులు చేసింది మరో వైపు ఇజ్రాయెల్ హెజ్ బోల్లా స్థావరాలపై లక్ష్యం చేసుకొని క్షిపణులను ప్రయోగిస్తోంది. ఫలితంగా బీరూట్, లెబనాన్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏది ఏమైనా తమ దేశంపై దాడులు చేసే వారు ఎక్కడ ఉన్నా వెతికి మరీ చంపుతామని నెతన్యాహూ శత్రు దేశాలకు వార్నింగ్ ఇస్తున్నారు.