పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు కేసుల్లో ప్రధానంగా వినిపించిన పేరు. అప్పట్లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. దేశంలో పేరు మోసిన లాయర్లను గడగడలాడించారు. తనకు తాను పెద్ద లాయర్ ని అని భావించారు. తన ముందు సుప్రీం కోర్టు లాయర్లు సైతం దిగదుడుపు అని వాదనలు వినిపించారు. కనీం ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబుకు చుక్కలు చూపించారు.


దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో కూర్చోబెట్టారు. అటు తర్వాత చంద్రబాబుకి బెయిల్ రావడం, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం చకచకా జరిగిపోయాయి. మధ్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విదేశాలకు వెళ్లారు పొన్నవోలు. ఓ సమావేశంలో అయితే ఏకంగా ఏడ్చేశారు. కానీ అందరూ ఏకమై జగన్ ను ఓడిస్తున్నారని బాధపడి పోయారు. ఆయన భావించినట్టే జగన్ ఓడిపోయారు. పొన్నవోలు ప్రభుత్వ పోస్టు ఊడిపోయింది. అయితే ఇప్పుడు లడ్డూ వివాదంలో మళ్లీ తెరపైకి వచ్చారు ఆయన.


తనకున్న లాయర్ తెలివితేటలు ఉపయోగించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై పొన్నవోలు మాట్లాడుతూ.. ఒక లాజిక్ చెప్పారు. పంది కొవ్వు కేజీ 1200 రూపాయలు  ఉంది. నెయ్యి కేవలం 400 మాత్రమే. అటువంటి సమయంలో ఖరీదైన పంది కొవ్వును నెయ్యిలో కల్తీ చేస్తారా అంటూ ప్రశ్నించారు. అసలు పంది కొవ్వు ఎక్కడ తీస్తారు. ఎక్కడ వాడతారు. దానికో రేటు ఎక్కడి నుంచి ఫిక్స్ చేస్తారు అన్నది పొన్నవోలుకే తెలియాలి.


ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబుని ఇరికించిన నేర్పరి ఆయన అని విశ్లేషకులు అంటుంటారు. ఈ కేసులో కూడా తన వాదనలు ఎలా వినిపిస్తారో చూడాలి. అయితే ఇంకాస్త ముందుకు వెళ్లి రాగిలో బంగారం కల్తీ చేస్తారా.. ఇత్తడితో బంగారం కలుపుతారా? అంటూ చెలరేగారు. అంటే నెయ్యి బదులు పంది కొవ్వు వాడటం. కల్తీ జరిగింది అని ఒప్పుకుంటాను కానీ.. అది పంది కొవ్వు కాదన్నది ఆయన వాదన. మొత్తానికి పొన్నవోలు లాజిక్ భలే ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: