రాధాకృష్ణతో రేవంత్ రెడ్డి అనుబంధం ఈనాటిది కాదు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొడంగల్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. దానిని తర్వాత స్థాయికి తీసుకెళ్లడంతో రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారని.. పైగా అప్పట్లో కేసీఆర్ ని నిలదీయడంతో రేవంత్ పోషించిన పాత్ర నచ్చి.. రాధాకృష్ణ అండగా నిలిచారని అంటుంటారు.


అందువల్లే రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతిలో విశేషమైన కవరేజ్ లభిస్తుంది. అంతటి ఓటుకు నోటు కేసులోను రేవంత్ తప్పు ఏదీ లేదన్నట్టుగానే ఆంధ్ర జ్యోతి అప్పట్లో వార్తలు రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ఆంధ్ర జ్యోతి కాపాడిన సందర్భాలు ఉనేకం. ఇక ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి ఆంధ్ర జ్యోతికి భారీగానే జాకెట్ యాడ్స్ వస్తున్నాయి. గత కేసీఆర్ హయాంలో ఆంధ్ర జ్యోతికి భారీగానే జాకెట్ యాడ్స్ వస్తున్నాయి. గత కేసీఆర్ హాయంలో ఆంధ్ర జ్యోతికి పెద్దగా ప్రకటనలు రాలేదు.



ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూల కథనాలనే ఆంధ్రజ్యోతి ప్రచురిస్తోంది. అయితే తొలిసారిగా రేవంత్ రెడ్డిని ఆంధ్ర జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఎడిషన్ మొదటి పేజీలో ఇందుకు సంబంధించి రాధాకృష్ణ తన కొత్త పలుకు రాశారు. హైడ్రా దూకుడు తగ్గించాలని.. కూల్చివేతలను నిలిపివేయాలని సూటిగా చెప్పేశారు. లేకపోతే కూల్చివేతలు ప్రభుత్వంగా స్థిరపడిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


పెద్ద పెద్ద వాళ్ల ఫామ్ హౌస్ లు కూల్చి వేసినప్పుడు వ్యతిరేకత వచ్చినా.. మూసీ నదిని ఆక్రమించి నిర్మించికున్న వారి ఇళ్లను ప్రభుత్వం కూలగొడుతున్నప్పుడు మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని రాధాకృష్ణ కుండ బద్దలు కొట్టారు. ఈ దశలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కూల్చివేతల ప్రభుత్వం అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోందని ఎందుకైనా మంచిదే దాని నుంచి జాగ్రత్త పడాలని రాధాకృష్ణ సలహా ఇచ్చారు. కేసీఆర్,కేటీఆర్ లు టార్గెట్ చేస్తూ రేవంత్ నిర్ణయాలు తీసుకుంటే.. అవి వాళ్లను మరింత బలవంతులగా మార్చుతాయని రాధాకృష్ణ అన్నారు. ఇలాంటి క్రమంలోనే నింపాదిగా వ్యవహరించాలని జాగ్రత్తగా అడుగులు వేయాలని రాధాకృష్ణ రేవంత్ కు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: