పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడి కంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఒక సగటు మనిషిగానే అంతా చూడాల్సి వస్తుంది. ఆయనకు ఏ విషయం మీద అయినా కమిట్ మెంట్ ఉందంటే దానిని ఎక్కడా ఆయన దాచుకోరు. అంతే కాదు ఆయన బలంగా గట్టిగా చెప్పాల్సిన చోట చెబుతారు. ఆయన స్వభావమే అంత.


ఆయన దేనికి ఎవరికీ భయపడరు. ఆయన ఈ దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దేశంలోని సనాతన ధర్మం పట్ల కూడా ఆయనకు ఉన్న అంకితభావం ఎమిటో తాజాగా ఆయన చెప్పిన మాటలు చేసిన ప్రసంగాలు చూస్తే అర్థం అవుతుంది. పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డూ  ప్రసాదం కల్తీ అయిన విషయంలో తీవ్రంగా కలత చెందారు అన్నది తెలిసిందే. అందుకే ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. అంతే కాదు కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లను కడగటం వంటి ఆధ్వాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


అంతే కాదు సనాతన ధర్మం పట్ట చులకనగా మాట్లాడరాదు అని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో సినీ సీమలో ఎవరు అయినా ఎలాంటి మాట మాట్లాడినా ఆయన సహించలేకపోయారు. ఆఖరుకు ప్రకాశ్ రాజ్ అయినా కార్తీ అయినా స్టాండ్ ఒక్కటే. ఆయన ఆవేశంగానే బదులు ఇచ్చారు.


అయితే పవన్ లో హిందుత్వ వైఖరి ఆయన ఆవేశం  కూటమిలోని టీడీపీకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే లడ్డూ విషయాన్ని టీడీపీ బయట పెట్టినా కామెంట్లు మాత్రం పరిమితికి లోబడే చేస్తోంది. పైగా ఆ పార్టీ చేసిన కామెంట్లు అన్నీ కూడా వైఎస్ జగన్ కేంద్రంగానే సాగుతున్నాయి. దాని వల్ల బహువిధాల లాభాలను టీడీపీ ఆశించింది. కానీ పవన్ కల్యాణ్ వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. దీనిపై వామపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మరో వైపు కొన్ని వర్గాల్లో కూడా సందేహాలు రేపేలా ఇటీవల పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి పవన్ తన ఆవేశాన్ని మరోసారి చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: