పొరుగు రాష్ట్రం తమిళనాడులో డీఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక విధంగా ప్రమోషన్ కొట్టేశారు. ఆయన మంత్రి అయింది 2022 డిసెంబరులో. అంటే గట్టిగా రెండేళ్లు తిరగకుండానే డిప్యూటీ సీఎం పోస్టుని అందుకున్నారు అన్నమాట. డీఎంకే ఒక ప్రాంతీయ పార్టీ. సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న డీఎంకే  సౌత్ ఇండియాలో తెలుగుదేశం, తదితర పార్టీలకు ఒక పోరాట స్ఫూర్తిగా ఉంటూ వస్తోంది.


ఒక డీఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఏర్పాటు అయినప్పుడు వ్యవస్థీకృతంగా కనిపించినా కరుణానిధి నాయకత్వంలోకి వచ్చిన మెల్లగా కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆయన వారసుడు స్టాలిన్ అయితే ఆయన వారసుడు ఉదయ నిధి స్టాలిన్.



ఇక ఇదే విధమైన పోలిక టీడీపీ విషయంలోను ఉంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అది కుటుంబ పార్టీ కాదు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఆరూపు సంతరించుకుంది. ఇప్పుడు టీడీపీకి వారసత్వ పార్టీగానే చూస్తున్నారు. చంద్రబాబు తర్వాత వారసుడు లోకేశ్ అని అంతా అనుకుంటున్నదే. ఇక లోకేశ్ విషయానికొస్తే.. రాజకీయంగా కాదు.. మంత్రి పదవులను నిర్వహించడంలోను ఉదయనిధి కంటే సీనియర్. 2017లోనే లోకేశ్ మంత్రి అయి రెండేళ్ల పాటు పనిచేశారు. మళ్లీ 2024లో లోకేశ్ మంత్రిగా పనిచేస్తు్నారు. ఈ అయిదేళ్లలో ఆయన సీఎం అవుతారు అంటే అది అంత జరిగే వ్యవహారం కాదు.



కూటమి పార్టీలతో నడుస్తోంది. టీడీపీకి సొంతంగా బ్రహ్మాండమైన మెజార్టీ ఉన్నా.. బీజేపీ, జనసేనలను దూరం చేసుకునే ఆలోచనలో చంద్రబాబు లేరు. దీంతో లోకేశ్ ని మంత్రిగానే కొనసాగిస్తున్నారు. మామూలు టీడీపీ ప్రభుత్వం అయితే నారా లోకేశ్ ఉప ముఖ్యమంత్రిగా అయినా ఆశ్చర్యం అవసరం లేదు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలనే కండిషన్ మీద పవన్ ఆ పదవిని స్వీకిరంచారు అనే టాక్ ఉంది. దీంతో మరో డిప్యూటీకి ఛాన్స్ లేదు. ఈ అయిదేళ్ల రాజకీయంలో ఏవైనా అవాంతరాలు ఎదురైతేనే లోకేశ్ గురించి ఆలోచించుకోవాలి. తమిళనాడు మాదిరిగా ఇప్పట్లో అయితే లోకేశ్ డిప్యూటీ అయితే కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: