దేశంలో ఇప్పటి వరకు సాధరాణ రైళ్లు నడుస్తుండటం చూస్తున్నాం. క్రమేణా రాజధాని, శతాబ్ది, వందే భారత్, వందే మెట్రో, వందే సాధరణ్ పేరుతో అనేక రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. త్వరలోనే హైడ్రోజన్ రైళ్లను తీసుకురాబోతుంది మోదీ సర్కారు. వచ్చే ఏడాది చివరకు తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతోంది. దీంతో పాటు సొంత పరిజ్ఙానంతో గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించే ఇంజిన్లను భారత్ తయారు చేయబోతోంది.


ఇన్ని ప్రత్యేకతలున్న సమయంలోనే మరో సరికొత్త రైలును మోదీ ప్రవేశ పెడుతున్నారు. దీన్ని ఎయిర్ ట్రైన్ అంటారు. ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం సర్వీసుగా వ్యవహరించే ఈ ఎయిర్ ట్రైన్  దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కాబోతుంది. విమానాశ్రయంలో ఉన్న మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు లేదంటే.. విమానాన్ని డీ బోర్డింగ్ చేసిన తర్వాత క్యాబ్ కోసం బస్సు సర్వీసు ఉంటుంది. అయితే ఇక్కడ సమయం చాలా తక్కువగా పడుతోంది.


ఎందుకంటే ఇది చాలా రద్దీగా ఉండే విమానాశ్రయం. ఏడుకోట్ల మంది  ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రానున్న ఎనిమిది సంవత్సారాల్లో ఈ సంఖ్య 13 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్ కు వెళ్లే ఆలస్యాన్ని నివారించేందుకు ఎయిర్ ట్రైన్  తీసుకురాబోతున్నారు.


ఇది మెట్రో తరహాలో డ్రైవర్ లేకుండా ఉంటుంది. రెండు వేల కోట్ల రూపాయలు వ్యయంతో దీనిని ప్రవేశ పెట్టనున్నారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి రానుంది. తక్కువ సంఖ్యంలో బోగీలుండే ట్రాక్ పై నడుస్తోంది. విమానాశ్రయంలోని హోటళ్లు, క్యాబ్ ఎక్కే పాయింట్లు, పార్కింగ్, ఇతర టెర్మినళ్లు వెళ్లడానికి దీనివల్ల సులువు అవుతుంది. వేగంగా తీసుకువెళ్తుంది. నాలుగు స్టాపులతో 7.7 కి.మీ. దూరాన్ని ఇది కవర్ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభానికి కసరత్తులు చేయబోతున్నారు. ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సు సర్వీసులను తొలగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: