తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టు విచరాణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.


 ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం విచారణను అక్టోబరు 3కి వాయిదా వేసింది. అలాగే  ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలా? లేదా అనే విషయంపై కూడా అప్పుడే క్లారిటీ ఇస్తామని పేర్కొంది. అంతేకాదు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా సుప్రీం కోర్టు కోరింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళకవారం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటించారు.


కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని.. ఈ నెల 3న సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందు కెళ్లడం జరుగుతుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ ఛైర్మన్ , రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణ జరిపి మూడో తేదీకి వాయిదా వేసింది.



అయితే దాదాపు సిట్ బృందం నాలుగు రోజుల పాటు విచారణ చేపట్టింది. దాదాపు తొలి విడత సిట్ విచారణ ముగిసినట్లు అయింది. ఈ నివేదికను ఇప్పటికే డీజీపీకి అందించారు. అయితే ఇంతలో సుప్రీం కోర్టు భిన్నంగా స్పందించడం, సీబీఐ ఎంటర్ కావొచ్చు అనే అనుమానాలతో సిట్ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: