ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందో అనాలా?  లే ఎరక్కపోయి వచ్చారు. ఇరుక్కుపోయారు అనాలా? ప్రస్తుతం పవన్ కల్యాణ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ఇంతకంటే దారుణంగా వస్తున్నాయి. అసలు ఏం చేద్దామనుకున్నారు. దేని గురించి పాకులాడారు? చివరకు ఏం మిగిలింది? ఇదేనా డిప్యూటీ సీఎంగా పవన్ ప్రజలకు చేసిన మంచి అని పలువురు విమర్శిస్తున్నారు.


అసలేం జరిగింది.. ఎందుకు పవన్ ను ఇంతగా ట్రోల్ చేస్తున్నారు. అంటే.. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసం నిలబడలాని పోరాటం చేసిన మనిషి. మొదట సహాయం లేకుండా ఒక్కడే తన శాయశక్తులా కష్టపడి ఎన్నికల్లో నిలబడ్డాడు. సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులందర్నీ గెలిపించుకున్నారు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ చేసిన కృషి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ వంతు సాయం అందించి వరద ముంపు బాధితులకు తమ చేతనైన సాయం చేశారు.


ఇక తిరుపతి లడ్డూ లో కల్తీ నెయ్యి వాడారని చంద్రబాబు ఆరోపించారు. ఇదంతా వైసీపీ హయాంలోనే జరిగింది అని విమర్శించారు. ఇది ఒక పక్క వైసీపీ, మరో వైపు కూటమి నేతలు తప్పు మీదంటే మీది అని ఒకరిపై ఒకరు మాటల యుద్ధం మొదలు పెట్టారు. అప్పుడే పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ఫైర్ అయ్యారు.


స్వామి వారికి జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత దీక్ష మొదలు పెట్టారు. ఇలా ఈ పది రోజులు అవకాశం దొరికిన ప్రతిసారి సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. అసలు నిజాలు ఏంటి? ఆధారాలు  ఉన్నాయా అంటూ ప్రశ్నించింది. ఏం తేలకుండానే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎలా మాట్లాడతారు అని ప్రశ్నల వర్షం కురిపించింది.  ఏది ఏమైనా సనాతన ధర్మం చెప్పి.. హీరో అవుదామనుకున్న పవన్.. చివరకు జీరో అయ్యారని పలువురు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: