వార్నీ.. లోకేశ్ తెలివి మామూలుగా లేదుగా లడ్డూ విషయంలో గ్రేట్ ఎస్కేప్! పాపం ఇరుక్కుపోయిన పవన్ కల్యాణ్?
ఏపీ రాజకీయాల్ని గమనిస్తున్నారా? అధికారంలో లేని వేళలో పార్టీని పవన్ లోకి తెచ్చేందుకు కిందా మీద పడి నడిపించిన నాయకుల్లో నారా లోకేశ్ ముందుంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కుమారుడిగా.. ఆయన రాజకీయ వారసుడిగా లోకేశ్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆరంభంలో ఎదురైన ఎదురుదెబ్బలతో అతను తన తీరుని మొత్తంగా మార్చేసుకున్నారనే చెప్పాలి.
జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు.. నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడంలో అప్పటి ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించడంలో జోరు చూపించిన నారా లోకేశ్.. కూటమి సర్కారులో మాత్రం తన పని తాను చేసుకొని పోతున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో నామమాత్రంగా జోక్యం చేసుకుంటూ ఉంటున్నారు.
పార్టీ అంశాల్లో మాత్రం అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాకుంటే ప్రొఫైల్ ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఏపీ వ్యాప్తంగా కూటమి సర్కారులోని సీఎం, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎంపీలతో పోలిస్తే లోకేశ్ మాత్రమే ప్రజలకు క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటున్నారు. ప్రతి రోజు ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే వారి సమస్యలు వినడం వారికి తగిన సాయం చేయడం వంటివి మనం గమనిస్తున్నాం.
ఇక విజయవాడ వరదల్లోను లోకేశ్ పర్యటించినా వాటికి పెద్దగా ప్రచారం లేకుండా ఉండేందుకు ఇష్టపడ్డారు. ఇక తిరుమల లడ్డూ విషయంలోను ఆయన ఎక్కడా హైలెట్ కాలేదు. లడ్డూ విషయంపై రాష్ట్ర, దేశ వ్యాప్తంగా పలువురు ఆరోపణలు విమర్శలు చేస్తున్నా లోకేశ్ మాత్రం ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా సుప్రీం కోర్టు కూడా దీనిపై సీరియస్ అయింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించింది.
ఈ సమయంలో లోకేశ్ వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉన్నారు. అలా ప్రతిపక్షాలకు పెద్దగా అవకాశం ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే పవన్ కల్యాణ్ మాత్రం సనాతన ధర్మం, ప్రాయాశ్చిత దీక్షలతో హడావుడి చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా లోకేశ్ లడ్డూ విషయంలో బాగా ఎస్కేప్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు.