మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న బిహార్ లో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి, తర్వాత రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్.. చెప్పినట్లుగానే తన జన సూరజ్ మూవ్ మెంట్ ను జగన్ సూరజ్ పార్టీగా గాంధీ జయంతి సందర్భంగా పాట్నాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి మనోజ్‌ భారతిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు.



భారతీ ఐఐటీయన్. దళితుడు. బిహార్ లోని మధుబని జిల్లాకు చెందిన వారు. ఈ రోజు ఆయన ఒక దళితుడిగా ఇక్కడ లేరు. ప్రశాంత్ కిశోర్ కంటే మెరుగైన వ్యక్తి కావడంతోనే ఆయన్ను ఎంపిక చేశాం. ఆయన దశితుడు కావడం యాదృచ్చికం అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.


రాష్ట్రంలో మద్య పాన నిషేధం ఎత్తివేయడం తమ అజెండాలో ఒక కీలక అంశం అన్నారు. మద్య నిషేధం కారణంగా బిహార్ ఏటా 20 వేట కోట్ల రూపాయలు నష్టపోతుందని.. తాము మద్య నిషేధాన్ని ఎత్తివేసి.. ఆ డబ్బును విద్య, ఉపాధి అకవాశాలు కల్పించేందుకు వినియోగిస్తామని ప్రకటించారు.


ప్రస్తుతం బిహార్ లో బీజేపీ-జేడీయూ ఐక్య కూటమి అధికారంలో ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహా గట్ బంధన్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ పార్టీతో ఏ పార్టీలకు సవాల్ గా మారుతుందో చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. అయితే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మాత్రం జన సూరజ్ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుందని కొట్టి పారేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం కేవలం సీఎం నితీశ్ కుమార్ నే టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. ఆయన వ్యవహార శైలి, మానసిక తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవేళ ఆయన నితీశ్ జేడీయూకి మైనస్ కలిగిస్తే… ఆయన సీఎం పదవి కోసం బీజేపీ ఆధారపడక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ బిహార్ లో పుంజుకుంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: