ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు మరోసారి సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తనదైన మార్కు పాలనతో ముందుకు సాగుతున్నారు. ఈ దఫా మాత్రం ప్రజలతో మరింత మమేకం అవుతూ.. వారున్న చోటుకి వెళ్లి కలిసే విధంగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.


అవును.. నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో సారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలతో మరింతగా మమేకం అవ్వడంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రజలు నాయకుల వద్దకు రావడం కాదు.. నాయకులే ప్రజల వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు కష్టసుఖాలు చూడాలన్నట్లుగా భావిస్తున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి చంద్రబాబు ఇలానే ఆలోచిస్తూ ఉన్నారని అంటున్నారు.


ఇందులో భాగంగా ప్రతి నెల 1న ఇచ్చే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోను చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. పేదల ఇళ్లకు వెళ్లి వారికి తానే స్వయంగా పెన్సన్ అందజేస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఆ పేదలు ఆత్మీయంగా టీ ఇస్తే టీ, మజ్జిగ ఇస్తే మజ్జిగ ఆప్యాయంగా ఇచ్చింది కాదనకుండా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గాంధీ జయంతి పురస్కరించుకొని చంద్రబాబు మచిలీ పట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.


మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎన్డీయే ప్రభుత్వం దేశ వ్యాప్తంగా స్వచ్చతే సే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీలోనూ కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కూర్చొని టీ తాగుతూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఆనందానికి అవధులు లేకండా పోయాయి. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా చంద్రబాబు తో పాటు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు, అధికారులు, మొదలైన నాయకులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: