ఏప్రిల్ లో ఇరాన్ అత్యున్నత దళం అయిన రెవెల్యూషనరీ గార్డ్స్ ను లిబియాలో చంపేసింది ఇజ్రాయెల్. దీనికి గట్టిగా బదులిస్తామని చెప్పిన ఇరాన్.. ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. వాటిని ఐరన్ డోమ్ తో సమర్థంగా ఎదుర్కొంది ఇజ్రాయెల్. ఆ తర్వాత ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం సంభవించింది.


దీని వెనుక పేజర్ పేలుడు ఉందనే ఊహాగానాలు వినిపించాయి. జులైలో ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వచ్చిన హమాస్ రాజకీయ విభాగం అధినేత ఇస్మాయెల్ హనియేను చంపేసింది. తమ దేశంలో అతిథిగా వచ్చిన హనియే హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇగ గత వారం ఇరాన్ సన్నిహితుడు లెబనాన్ కు చెందిన ఉగ్ర సంస్థ హెజ్బోల్లా అధినేత హసన్ నస్రల్లా ను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇక ఇరాన్ ఆగ్రహం నషాలానికి ఎక్కింది.


రెండు రోజుల క్రితం యెమెన్ లోని హౌతీ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. గత ఏడాది అక్టోబరు నుంచి హమాస్ తో తలపడుతోంది ఇజ్రాయెల్. ఇక హెజ్బోల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతున్నవి. వీటకి శిక్షణ కూడా ఇస్తోంది. దీంతో తాము ఇజ్రాయెల్ ను విడిచిపెట్టమని ప్రకటించింది. ఇలా ఏం జరుగుతుందో అని అంతా ఆందోళన చెందుతుండగా మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ పైకి 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.


ఇజ్రాయెల్ పైదాడి చేయకుంటే అది దైవ దూషణే అని ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ తెలిపారు. ఈ ప్రకటన తర్వాత ఇరాన్ క్షిపణులు వర్షాన్ని కురపించింది. అయితే వీటిలో చాలా వాటిని ఇజ్రాయెల్ డోమ్ సిస్టం అడ్డుకుంది. తాజాగా మంగళవారం 400 క్షిపణులు అని తొలుత ప్రకటించినా అవి 200 మంది మత్రమేనని తేలింది. ఇంతటితో తమ దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్  కంటే ఇరాన్ టెక్నాలజీలలో వెనుకబడి ఉంది. అంతే కాదు.. ఆయుధ సామర్థ్యం తక్కువే. అలాంటి ఇరాన్ గనుక ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తే ఎంతో కాలం పోరాడలేదు. తమ పరిమితులు తెలిసే ఇరాన్ ఇలా పరిమిత యుద్ధం చేస్తోందని విశ్లేషకులు మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: