కాదేదీ బూతులకు అనర్హం అన్నట్లు సమాజం తయారవుతోంది. మామూలుగా మాట్లాడితే అసలు కుదిరి చావడం లేదు. ఎందుకుంటే మెదళ్లు అన్నీ మొద్దు బారిపోయి ఉన్నాయని భావన. అందుకే చెవుల్లోనే కాదు మనసుల్లో కలకాలం నిలవాలంటే వేరే భాష వాడాల్సిందేనా? ఇదే ఇప్పుడు చర్చగా ఉంది.



ఒకప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు అని ఒక పెద్ద విభజన గీత గీసి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకనాడు హుందాకే కేరాఫ్ పొలిటిషయన్లు ఉండేవారు. అధికార పక్షం  విపక్షం మధ్య ఆవేశకావేశాలు  నాడూ ఉండేవి. కానీ హద్దులు అయితే దాటిపోలేదు. ఒక ఉన్నత ప్రమాణాలు అంతా పాటిస్తూ వెళ్లేవారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి అని అంతా పెదవి విరుస్తున్నారు. ఏపీలో అయిదేళ్ల పాటు అదికారం చెలయించిన వైసీపీ లో కొందరు మంత్రులు తీరు వివాదస్పదం అయింది అంటే వారు వాడే భాషను బట్టి అని అనేవారు.


బూతుల నేతలు పోలింగ్‌ బూతులతోనే బుద్ధి చెప్పాలని కూడా రాజకీయ అసాంతం చూసిన పెద్దలు కూడా హితవు చెబుతూ వచ్చారు. ఇక ఏపీలో టీడీపీ నేతలు కొందరు కూడా అదే తీరులో ఉండేవారు. వారిని మించి ఓవర్ డోస్ వైసీపీ చేయడం దాని ఫలితాలు చూడటంతో ఇప్పుడు రెండు వైపులా నుంచి ప్రస్తుతం కొంత కంట్రోల్ లో ఉన్నారు. అయితే తెలంగాణలో మాత్రం అలా లేదు. ఏపీని మించి సాగుతోంది.


రాజకీయాలతో సంబంధం లేనివారిని కూడా తెచ్చి విమర్శిస్తున్నారు. అత్యంత జుగుప్సాకరంగా ఈ విమర్శలు ఉంటున్నాయి. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ చూస్తే ఇదేమీ రాజకీయం అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో మంత్రి సురేఖను ట్రోల్స్ చేసిన వారు కూడా ఉన్నారు. ఆమెను అలా ఎందుకు అలా చేస్తారు కూడా గట్టిగా వాదించాల్సిందే. దెబ్బకు దెబ్బ అన్నట్లు బూతులకు బూతులతోనే సమాధానం చెబుతున్నారు. అయితే దేనికైనా ఒక హద్దు ఉండాలని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కసారి అవి కట్టు తప్పిదే ఇక వేటికి విలువలు ఉండవని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: