తెల్లారితే తెలంగాణలో బోలెడు సమస్యలు. రైతులు విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరికీ సమస్యలున్నాయి. సమస్యలు లేని వారిని ఒక్కరిని కూడా ప్రభుత్వం చూపించే పరిస్థితి లేదు. వీటికి తోడు హైడ్రా సమస్య మరింత పెద్దగా మారింది. సామాన్యులు హైడ్రా పేరు వింటేనే భయపడే పరిణామాలు వచ్చేశాయి. ఇలాంటి సమయంలో ఏ సమస్యలు లేన్నట్లుగా అటవీ, పర్యావరణ, ఎండోమెంట్ మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్ ఓ ప్రముఖ నటిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.


ఇవి కాస్తా రచ్చ రచ్చ అయ్యాయి. దీనిపై టాలీవుడ్ భగ్గుమంటుంది. ఎవర్నీ అంటే ఎవరు ఊరుకుంటారు. ఈ స్థాయి రెస్పాన్స్ రావడంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. అసలు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఎందుకు మాట్లాడాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎడా పెడా మాట్లాడేస్తే ఊరుకోవాలా? మంత్రి స్థాయిలో ఉన్న వారు ఎంత హుందాగా వ్యవహరించాలి. ఎదుటి వారిపై దుమ్మెత్తి పోస్తే సరిపోతుందా?


బంగారు తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను ఆశిస్తున్నారు. ఇవన్నీ వదిలేసి వివాదాస్పద వ్యాఖ్యలతో పొద్దు పుచ్చితే ఇదేం పాలన అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇంత జరిగినా కొండా సురేఖ మళ్లీ రెచ్చిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కేటీఆరే కారణం అని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల స్కాం చేశారని విమర్శించారు.


ఇంత రచ్చ జరుగుతున్నా.. అవేమీ పట్టన్నట్లు మళ్లీ కేటీఆర్ ని ఇలా టార్గెట్ చేయడంపై ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఆడిస్తున్న గేమ్ ప్లాన్ గా కొందరు అంటున్నారు. తెర వెనుక ఆయన ఉండి.. కావాలనే కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారనే వాదన తెరపైకి వస్తోంది. హైడ్రా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత మొదలైంది. స్వయంగా హైకోర్టే హైడ్రా పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు గ్యారంటీ పథకాల అమలు సరిగా లేదు. వీటన్నింటిని సైడ్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: