తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దిల్లీ టూర్ పెట్టుకున్నారు. సోమవారం చంద్రబాబు దిల్లీ పయనమై వెళ్లునున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో అది అత్యంత ఆసక్తిగా మారుతోంది. ఎందుకంటే లడ్యూ ఇష్యూ తర్వాత చంద్రబాబు దిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి.
ఏపీలో సెప్టెంబరు నెల మధ్య నుంచి శ్రీ వారి లడ్డూ ఇష్యూ ఎంతటి సంచలనం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిందో అందరికీ తెలిసిందే. హిందూత్వ నినాదంతో దశాబ్దాలుగా ముందుకు సాగుతున్న బీజేపీ కంటే కూడా టీడీపీ జనసేన ఈ విషయంలో దూకుడు వేశాయి. అదే సమయంలో చంద్రబాబు పలుమార్లు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది అని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఈ పరిణామంతో కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
ఇక ఇదే సమయంలో ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లడం.. లడ్డూ కల్తీపై ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించడంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిపై వై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక సీనియర్ నేతగా ఎన్డీయేలో ముఖ్య భాగస్వామిగా ఉన్న చంద్రబాబు లడ్డూ విషయంలో ఇరుకున పడ్డారు అనే ప్రచారం కూడా సాగింది.
ఈ మొత్తం క్రమంలో చంద్రబాబు దిల్లీ టూర్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. దిల్లీలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఆయన ఏపీకి సంబంధించిన అనేక సమస్యలను కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావిస్తారు అని తెలుస్తోంది. అలాగే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి విశాఖ రైల్వే జోన్ కి తొందరగా శంకుస్థాపన చేసి అంశాన్ని కూడా చర్చిస్తారు అని అంటున్నారు. అయితే లడ్డూ విషయం కూడా పూర్తిగా అన్నీ వివరిస్తారు అని చెబుతారు అని అంటున్నారు. మరి దీనిపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.