దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయా? బీజేపీకి క్రమేపీ ఆదరణ తగ్గుతోందా? 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకుంటుందా? కేంద్రంలో అధికారానికి చేరువ అవుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.


తాజాగా జరిగిన హరియాణా, జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్ కే అవకాశం ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో గతంలో చేజారిన రాష్ట్రాలు ఒక్కొక్కటి హస్తగతం అవుతున్నాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయింది. 2019 ఎన్నికల నాటికి మరింత పతనమైంది. కానీ 2024 నాటికి  వచ్చే సరికి ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకొంది.


భవిష్యత్తు పై ఆశలను సజీవంగా నిలుపుకుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీయే కూటమి పరంగా 400 సీట్లు దక్కించుకుంటామని కాషాయ దళం ధీమా వ్యక్తం చేసింది.  కానీ బీజేపీ బలం 240 సీట్లతో నిలిచిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ సైతం సెంచరీకి చేరువ అయింది. ఇప్పుడు వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన పోటీ ఇస్తోంది.


ఇక ఇప్పుడు జరిగిన హరియాణా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ అని సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్నంత రాణిచంలేకపోయింది. కీలకమైన రాష్ట్రాల్లో ఆ పార్టీకి కనీసం సీట్లు కూడా రాలేదు. దీంతో మిత్రులు సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.  ఒకవేళ జరిగిన ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం.. ఆ పార్టీకి డేంజర్ బెల్స్ మోగినట్టే. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరియాణాలో వరుసగా మూడు సార్లు అధికారంలో ఉండటం ఆపార్టీకి వ్యతిరేకతకు కారణం అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం 2029 ఎన్నికల సమయంలో అధికారానికి చేరువ కావడం ఖాయమని కొందరు అభిప్రాపయడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

bjp