ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మద్దతు కలిగిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా కకలావికలం అవుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బీరూట్ దద్దరిల్లుతోంది. హిజ్బుల్లా మిలిటెంట్లను వెతికి వెంటాడి చంపేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్ గా ఉన్న హసన్ నష్రల్లాను బీరూట్ దాడిలో చంపేసింది ఇజ్రాయెల్.
ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన హషీమ్ షఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడిలో మరణించాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే కీలకమైన నేతల్ని ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. దీనికి ముందు కీలకమైన హిజ్బుల్లా కమాండెంట్లను ఖతం చేసింది. అయితే హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ పదవి ఎవరు చేపట్టినా చంపేస్తాం అని ఇజ్రాయెల్ పరోక్షంగా దాడులతో సమాధానం ఇస్తోంది. బాధ్యతలు తీసుకునేందుకు ఇప్పుడు హిజ్బుల్లా నేతలు వణుకుతున్నట్లు తెలుస్తోంది.
హిజ్బుల్లా పోలిటికల్ కౌన్సిల్ ఆఫ్ చీఫ్ ఇబ్రహీం అమీన్ అల్ సయ్యద్ తదుపరి బాధ్యతలు తీసుకుంటారు అనే సమాచారం వినిపిస్తోంది. హషీమ్ సఫీద్దీన్ మరణం తర్వాత ఇతడి పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ బాధ్యతలను తీసుకునేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అయితే హిజ్బల్లా మాత్రం నస్రల్లా వారుసుడిగా ఎవరిని నామినేట్ చేయలేదని చెబుతోంది. సమష్టి నాయకత్వం లో హిజ్బుల్లా ఇజ్రాయెల్ విమర్శించే పై పోరాడుతోంది అని చెబుతున్నారు. హిజ్బుల్లాను విమర్శించే అలీ అల్ అమిన్ మాట్లాడుతూ.. హిజ్బుల్లా కొత్త సెక్రటరీ జనరల్ గా ఎవరూ బాధ్యతలు తీసుకున్నా… నస్రల్లా.. సఫీద్దీన్ కి పట్టిన గతే పడుతుంది అని అన్నారు. ఏ అభ్యర్థి అయినా కూడా వరు మరణానికి అభ్యర్థి అని చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులతో హిజ్బుల్లా అయోమయంలో ఉంది. పార్టీ డిప్యూటీ లీడర్ తన పాత్రను బట్టి నయీమ్ ఖాస్సెం తాత్కాలిక సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే హమాస్ దాడి జరిగి అక్టోబరు 7 కి ఏడాది పూర్తైన సందర్హంగా తమ లక్ష్యాలు నెరవేరినప్పుడే యుద్ధాన్ని ఆపేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమాన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి దాడి జరగకుండా తమ దేశ పౌరులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.