వైసీపీ అన్నది జగన్ కలల సౌధం. ఆయన ఆ పార్టీకి అధినేత. నేను మీ అందరికీ ప్రతినిధిని అని జగన్ తాజాగా ఆ పార్టీ నేతలతో అనవచ్చు కానీ.. జగన్ రెక్కల కష్టం వైసీపీ. జగన్ ఆశల రూపం వైసీపీ. జగన్ నిర్ణయమే ఇక్కడ ఫైనల్.


వైసీపీ బాగుండాలనే జగన్ ఆలోచిస్తారు. అదే సమయంలో ఎవరైనా సలహాలు ఇస్తే ఆయన స్వీకరించవచ్చు లేదా పక్కన పెట్టవచ్చు. ఇక వైసీపీలో ఉన్న వారు జగన్ ఆలోచనలో మేరకు పని చేయాలి. పార్టీ అంటే అలాగే ఉండాలి. ఒకే మాట మీద క్రమశిక్షణతో అన్నది జగన్ ఆలోచన. జగన్ పార్టీ వయసు 13 ఏళ్లు. మరో నాలుగు నెలల్లో 14 ఏళ్ల పార్టీ అవుతుంది. అయితే ఈ తక్కువ టైంలో ఎన్నో ఆటు పోట్లను వైసీపీ చూసింది. జగన్ మూడున్నర పదుల వయసులోనే అతి పెద్ద రాజకీయ సవాల్ ఎదుర్కొన్నారు. 


దాంతో జగన్ కి కష్టాలు అలవాటు అయిపోయాయి. సవాళ్లు కూడా ఆయన ఏమీ వచ్చినా లెక్క చేయరు. అయితే పార్టీ విపక్షంలో ఉండగా వేరడం వేరు. విపక్షం నుంచి అధికారంలోకి వచ్చి మళ్లీ విపక్షంలోకి వచ్చాక కొనసాగడం వేరు. ఈ తత్వం సరిపడని వారు పార్టీ గేటు దాటి బయటకు వెళ్లిపోయారు. అందులో జగన్ సొంత బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఉన్నారు.


అదే విధంగా ఆళ్ల నాని, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, కిలారి రోశయ్య, ఉదయ భాను వంటి వారు ఉన్నారు. అయితే ఇలా వెళ్లిన వారిని వైసీపీ పిలిచి మాట్లాడింది లేదు. అయిదేళ్ల పాటు ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటికి తట్టుకొని ఉండేవారు ఉంటారు అన్నదే వైసీపీ అధినాయకత్వం ఆలోచన. ఇలా వెళ్లిన వారంతా అధికారంలో ఉంది కదా అని అవకాశాలు ఉంటాయని భావించి వెళ్తే.. ఒకవేళ అక్కడ అవకాశాలు లేక మళ్లీ పార్టీని ఆశ్రయిస్తే తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని జగన్ గట్టిగా తెగేసి చెబుతున్నారంట. పార్టీ కష్ట కాలంలో వదిలేసి వెళ్లిన వారు తనకి అవసరం లేదని వైసీపీ అధినేత భావిస్తున్నారంట.  చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: