ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె స్వరూపం మారుతుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ది పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి.  ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. పోనీ ఆర్థిక సంఘం నిదులు విడుదల అయ్యయి అంటే అవి పక్కదాని పట్టేవి. సంక్షేమ పథకాల కోసం మళ్లించేవారు. దీంతో ఒక్క పని చేసే స్థితిలో పంచాయతీలు ఉండేవి కావు.


పంచాయతీలు ఖాళీగా ఉండేవి. ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా పంచాయతీలపై ఫోకస్ పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖను నిర్వర్తిస్తుండటంతో పల్లె పాలనపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో ఏకకాలంలో 13 వేలకు పైగా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు.


ప్రజాపయోగ పనులను గుర్తించారు. అయితే గ్రామ సభల నిర్వహణ రికార్డులకు ఎక్కింది. ప్రపంచ రికార్డును నమోదీఉ చేసింది. అయితే పనులను గుర్తించడమే కాదు.. ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ నెల 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 20 లోపు గుర్తించిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సంక్రాంతి లోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.


 అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా పంచాయతీలు ఉన్నాయి. గ్రామ సభల్లో దాదాపు 30 వేల వరకు పనులను గుర్తించారు.  ఆ నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.4500 కోట్లు నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే రూ.2239 కోట్లు విలువైన 26715 పనులను అనుమతులు ఇచ్చారు. మిగిలన పనులకు సైతం అనుమతులు ఇవ్వాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులు ఉపాధి హామీ పథకానికి సంబంధించినవి. పనుల్లో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా పనులు  పూర్తి చేయాలని పవన్ ఆదేశించారు. మొత్తానికి అయితే పవన్ కట్టి ప్రయత్నాల్లో ఉన్నారని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: