బీజేపీ విషయంలో జగన్ కు భ్రమలు తొలిగిపొయాయా? బీజేపీ తనను అవసరానికి వాడుకొని వదిలేసిందని గ్రహించారా? మున్ముందు ఆ పార్టీతో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ విషయంలో జగన్ చాలా రకాలుగా ఆలోచించారు. ఆ పార్టీపై పెద్దగా ఆరోపణలు చేసింది కూడా లేదు.


అయితే ఉన్నట్టుండి జగన్ ఇప్పుడు గేర్ మార్చారు. బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇది రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిగా మారింది. జమ్మూ కశ్మీర్ తో పాటు హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తలకిందులు చేస్తూ.. హరియాణాలో బీజేపీ వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చింది. ముచ్చగటా మూడో సారి పవర్ దక్కించుకుంది. అయితే ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ మరోసారి అనుమాన్యం వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఓట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.


ఎప్పుడైతే ఈవీఎంలను లెక్కబెట్టడం మొదలు పెట్టారో అక్కడి నుంచి బీజేపీ దూకుడు మొదలైంది. ఒక్కసారిగా కాషాయ పార్టీ పుంజుకుంది. చివరకు అధికారానికి అవసరమైన సీట్లను సాధించగలిగింది. అయితే ఇక్కడ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ప్రారంభం అయ్యాయి. హరియాణాలో బీజేపీది ప్రజా విజయం కాదంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. జాతీయ స్థాయిలో విపక్షాల సైతం ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు.


అయితే అప్పట్లో ఎన్నికల సమయంలోను జగన్ ఇదే ఆరోపణలు చేశారు. కానీ బీజేపీని నేరుగా విమర్శించలేకపోయారు. కానీ ఇప్పుడు అదే అర్థం వచ్చేలా ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని అన్నారు. ప్రజస్వామ్యానికి మేలు జరగాలంటే బ్యాలెట్ పేపర్లు ఒకటే మార్గం అని జగన్ తన బలమైన వాదనలు వినిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోదీ మార్క్ ఎన్నికల నిర్వహణ, వరుస విజయాలపై ప్రతిపక్ష పార్టీలకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వైసీపీ కూడా వచ్చి చేరింది. పేపర్ బ్యాలెట్ నినాదంతో విపక్ష కూటమికి జగన్ దగ్గర అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి చివరకు ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: