ఆంధ్ర జ్యోతి గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు ఏపీ ప్రభుత్వంలో వైఫల్యాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. వైఫల్యాలపై పదే పదే వార్తలు రాస్తున్నారు. ఆయన కొత్త పలుకు ద్వారా సుద్దులు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదని.. తప్పులు పైన తప్పులు చేస్తున్నదని ఏపీ ప్రభుత్వం పై వార్తలు రాస్తున్నారు.


ఏపీ సర్కారుకు తమ నాయకులపైనా, అధికారుల పైన నియంత్రణ లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు ఆర్కే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా  దొపిడీ చేస్తున్నారని, అధికారులు సీఎం మాట కూడా వినే  పరిస్థితిలో లేరని రాధాకృష్ణ సెలవిచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఇంకా వైసీపీ నాయకులు చెప్పినట్లు జరుగుతుందని ఇంకా.. వైసీపీకి అనుకూలమైన అధికారులే ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో ఉన్నారని ఆర్కే అంటున్నారు.


మొత్తంగా ఏపీ ప్రభుత్వంపై పదే పదే ఏబీఎన్ ఆర్కే విమర్శలు చేస్తున్నారు. ఏపీలో ఇసుక ఉచితంగా ఇచ్చే విధానం అమలు కావడం లేదని పదే పదే చెబుతున్నారు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు అభాసుపాలయ్యారని దెప్పి పొడుస్తున్నారు. అంతే కాదు.. ఏపీలో మద్యం విధానానికి సంబంధించిన టెండర్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాదు రేషన్ బియ్యాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా కాంట్రాక్టులు పొంది దోచేస్తున్నారని ఆరోపించారు.


నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని చెబుతున్నారు. ఈ రకంగా దాదాపు 30, 40 అంశాలకు సబంధించి ఏపీ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ.. గడిచిన కొద్ది రోజులుగా దాదాపు నాలుగు వారాలుగా వార్తలు రాస్తూ వస్తున్నారు రాధాకృష్ణ.  అయితే ఏబీఎన్ టీడీపీ అనుబంధ పత్రికగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గతంలో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు, తప్పులను చూపించని ఆంధ్ర జ్యోతి ఇప్పుడు మాత్రం నెగిటివ్ అంశాలనే ఫొకస్ చేస్తుంది. ఇక ఈ విమర్శలు, ఆరోపణలపై టీడీపీ సైతం మౌనంగా ఉంటుంది. క్యాడర్ నుంచి కూడా పెద్దగా స్పందన రావడం లేదు ఎంటో.

మరింత సమాచారం తెలుసుకోండి: