అసెంబ్లీ ఎన్నికలకు ముందే జగన్ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు బీసీ మంత్రాన్ని పఠించారు. బీసీలకు పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టారు. వారి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఇవేమీ వర్కౌట్ కాలేదు. భారీ ఓటమి ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ఓటమిని జీర్ణించుకోలేకపోయిన జగన్.. బీసీ నినాదాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.


కేవలం జగన్ బీసీ నినాదాన్ని తెరపైకి తేవడం.. ఇతర వర్గాలను అందలం ఎక్కించడం తదితర కారణాలతో రెడ్డి సామాజిక వర్గం జగన్ కు దూరం అయింది. రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గం అనేది జగన్ కు  పని చేయలేదు. గత ఐదేళ్ల పరిణామాలను గమనించిన రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ అయింది. గత రెండు ఎన్నికల మాదిరిగా చురుగ్గా పని చేయలేదు.


దాని ప్రభావమే ఈ ఘోర ఓటమి. అందుకే ఈ జగన్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వైసీపీ ప్రక్షాళనకు దిగారు. రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా విభజించి.. తన సామాజిక వర్గానికి చెందిన నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఒక్క బొత్సకు మాత్రం ఉభయ గోదావరి జిల్లాలను విడిచి పెట్టారు. అక్కడ జనసేన ప్రభావం అధికంగా ఉండటం. కాపులు పవన్ కల్యాణ్ వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో బొత్సకు అక్కడి బాధ్యతలు అప్పగించారు జగన్.


ఉత్తరాంధ్రకు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను అప్పగించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలను ఎంపీ మిథున్ రెడ్డి చేతిలో పెట్టారు. కృష్ణా జిల్లా బాధ్యతలను రాజ్య సభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కి అప్పగించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లా బాధ్యతలను పెద్ది రెడ్డికి అప్పగించారు జగన్. ఆరు రీజియన్లను విభజించి.. పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. అందులో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానకే కేటాయించారు. ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు మాత్రం సామాజిక వర్గానికి చెందిన బొత్సకు అప్పగించారు. ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: