వెనుక ముందు చూసుకోకుండా.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం.. ఆన్ లైన్‌  వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఫేమస్ గా మారిన బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు వైసీపీ యేతర నేతలపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం రాయలేనంతంగా మాటలు అనేయడం లాంటివి బోరుగడ్డ అనిల్ కు ఎక్కువే.


అతడిపై బోలెడు కేసులు నమోదై ఉన్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నుంచి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన అనిల్ ను ఈ మధ్యనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఎదుట హాజరు పరచగా.. అతనికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


కోర్టుకు హాజరు పరచడానికి ముందు దాదాపు రెండు గంటల పాటు గుంటూరు అరండల్ పేటల డీఎస్పీ జయరాం ప్రసాద్ తో పాటు … మరికొందరు పోలీసుల సమక్షంలో అనిల్ ను విచారించినట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతను మొదలు కొని మహిళా నేతల్ని ఇష్టారాజ్యంగా ఎందుకు తిట్టావు? నీ వెనుక ఎవరు ఉన్నారు? ఎవరు చెబితే ఇదంతా చేశారు ? ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడకు వెళ్లావు? లాంటి ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.


వీటికి అనిల్ సమాధానమిస్తూ.. కొందరు వైసీపీ నేతల ఒత్తిడి.. ప్రోద్బలంతోనే తాను అప్పట్లో అలా వ్యవహరించినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వారి పేర్లను వెల్లడించలేదని సమాచారం. కొందరు వైసీపీ నేతల మాటలు నమ్మి తాను దూకుడుగా వ్యవహరించినట్లుగా పేర్కొన్నట్లు సమచారం. ఇకపై అలాంటి తప్పులు చేయనని వాపోయారు అంట. నీ వెనుక ఉన్న వైసీపీ నేత ఎవరు అని పదే పదే ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని టాక్. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒకరు తనకు ఫ్యూచర్ ఉందనిచెప్పారని.. ఇప్పుడు ఆ పార్టీ నేతే కండువా మార్చారని తనను పట్టించుకోవడం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయనపై గుంటూరు జిల్లాలోనే వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 20 కేసులు పైగా నమోదై ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: