సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. రాజకీయ పార్టీలు సైతం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాను బలంగా నమ్ముతున్నాయి.  ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియా వింగ్ ను పెంచి పోషిస్తోంది. పార్టీ అనుబంధ సంఘాల కంటే సోషల్ మీడియాతోనే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నాయి. ఏపీలో సైతం అన్ని పార్టీలు దాదాపు సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి.


వైసీపీ సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీ ఆవిర్బావం నుంచి సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లగలిగారు. 2014 ఎన్నికల్లో వైసీపీ మంచి పనితీరు కనబరిచింది. 67 స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించింది. 2019 ఎన్నికల సమయానికి వచ్చే సరికి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సార్లు వైసీపీ సోషల్ మీడియా పోషించిన పాత్ర మరువలేనిది.


ఐ ప్యాక్ టీంతో కలిసి సమానంగా సోషల్ మీడియా వింగ్ పని చేసింది. అందుకే మంచి ఫలితాలు వచ్చాయి. వైసీపీ సోషల్ మీడియాను విజయ సాయి రెడ్డి హ్యాండిల్ చేసేవారు. ఎప్పటికప్పుడు కొత్త నియామకాలు చేపట్టి.. పార్టీకి అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయించేవారు. ఇది బాగా వర్కౌట్  కావడంతో వైసీపీ విజయవంతం అయింది.


అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో సోషల్ మీడియా తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ విభాగాన్ని చూస్తున్న సజ్జల రామ కృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిని జగన్ బాధ్యతల నుంచి తప్పించారు. కొత్త నేతకు వీటిని అప్పగించారు. ఇప్పుడు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతూనే.. సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు జగన్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సోషల్ మీడియా ప్రతినిధులకు జగన్ సూచిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: