ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీకి ఓటర్లు చుక్కలు చూపించారు. కేవలం 11 స్థానాలు మాత్రమే కట్టబెట్టి ప్రతిపక్ష హోదాకు కూడా దూరం చేశారు. కనీసం ఆ పార్టీ 90 స్థానాలతో అయినా అధికారంలోకి వస్తామని అంచనా వేసింది. 


 ఆ ప్ఆంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా.. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. అయితే ఇంతటి ఓటమికి నేతల తీరు అనేది ముఖ్య కారణం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రీజలన్ కో ఆర్డినేటర్ వ్యవస్థతోనే పార్టీకి భారీ నష్టం జరిగిందన్న నివేదికలు వచ్చాయి.  ఈ వ్యవస్థపై పార్టీ శ్రేణుల నుంచి కూడా భారీ ఫిర్యాదులు అందాయి. దీంతో జగన్ సైతం వారి అభిప్రాయంతో ఏకీభవించారు.


రీజనల్ కో ఆర్డినేటర్ వ్యవస్థను తీసేద్దాం అనే నిర్ణయానికి వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ అదే వ్యవస్థను ప్రారంభించారు వైసీపీ అధినేత. కో ఆర్డినేటర్లుగా తాను నమ్మిన వారికే బాధ్యతలు అప్పగించారు. 

 


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ డమ్మీ అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందనే అపవాదు ఉంది. మంత్రుల కంటే ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు జగన్.  రీజనల్ కో ఆర్డినేటర్లు అన్ని నియోజకవర్గాల్లో వేలు పెట్టేవారు. అందరి సమన్వయ బాధ్యతలు చూసేవారు. దీంతో మంత్రులకులేని గౌరవం కో ఆర్డినేటర్లకు దక్కింది. పార్టీలో విభేధాలకు ఇదే కారణం అయింది.


జగన్ సీఎంగా ఉండగా రీజనల్ కో ఆర్డినేటర్లు సామంత రాజులుగా వ్యవహరించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.   తమకున్న అధికారాలను పక్కదారి పట్టించారనే విమర్శలు వచ్చాయి. అసలు వద్దనుకున్న వ్యవస్థను జగన్ ఎందుకు ప్రారంభించారు ? ఆయన భయం ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: