తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.  ఇంత కాలం ఎప్పుడు ఎప్పుడా అని  ఎదురు చూస్తున్న రైతు భరోసాపై కీలక ప్రకటన చేసింది. అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.


తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీని ఈ నెలలోపు పూర్తి చేస్తామని అన్నారు. రూ.2లక్షల లోపు రుణమాఫీ కానీ వారు 4 లక్షల మంది ఉన్నారని.. వారికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ నిధులు జమ కాలేదని అన్నారు. ఈ సమస్యలను పూర్తి చేసిన తర్వాత రూ2లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీని విడదల వారీగా అమలు చేస్తామని అన్నారు. అయితు రైతు భరోసా ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందంటే..


తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద పంట వేసుకునే ప్రారంభంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున అందించాలని నిర్ణయించి.. ప్రతి ఏటా రెండు విడతలుగా అందించింది. అంటే ఎకరాకిని రూ.పది వేలను సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రైతు బంధును రూ.పది నుంచి రూ.పదిహేను వేల కు  పెంచుతామని ప్రకటించారు.


అయితే ఇందులో సగం రూ.7500 ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం అయ్యాయి. జనవరిలో మళ్లీ పంట వేసేందుకు రైతులు సిద్ధం కానున్నారు. అయితే అప్పుడే రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి గత పెట్టుబడి సమయంలోనే రూ.7500 ఇవ్వాల్సి ఉంది. అప్పుడు రుణమాఫీ చేయడంతో ఈ తర్వాత ఒకేసారి రూ.15 వేలు ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన బట్టి చూస్తే రూ.7500 చెల్లించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: