విజయమ్మ లేఖ.. అంతకుముందు షర్మిల చెప్పిన మాటలు.. ఈ వ్యవహారంలో భారతి పాత్ర.. మొత్తంగా చూస్తే జగన్ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ పాలిట్రిక్స్ లో ఆయన వలవిలలాడుతున్నట్టు అర్థమవుతోంది. షర్మిలపై ఏకపక్షంగా జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక.. తాను నిజాలు మాత్రమే చెబుతున్నానని..ఇందులో రాగద్వేషాలకు తావు లేదని విజయమ్మ స్పష్టం చేశారు.
“ఆస్తుల విభజన చేద్దామని ముందుగా జగనే అన్నారు. ఎంవోయూ కూడా ఆయన చేశారు. జగన్ చెబుతున్నవి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలు. మా కుటుంబ బంధువులుగా వారు ఎంవోయూ పై సంతకాలు చేశారు. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. ఆ ఎంవోయూ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి 60%, షర్మిలకు 40 శాతం ఆస్తుల విభజన జరగాలి. ఎంవోయూ లో షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ కానుకగా ఇస్తున్నవి కాదు. అది అతని బాధ్యత. సరస్వతి షేర్స్ 100%, యలహంక లో ఆస్తిని 100% షర్మిలకు ఇస్తానని నాడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. సంతకం కూడా పెట్టాడు.. అయితే అవి ఇవ్వలేదు.
కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో షర్మిల తన అన్న గురించి గొప్పగా చెప్పింది. ఆమెను జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు లాగా చూసుకుంటాడని మురిసిపోయింది. తనకు ఏ కష్టం వచ్చినా అడ్డు నిలబడిపోతాడని ఆనందపడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పరస్పరం విమర్శలు చేసుకునే దాకా వచ్చింది.
అన్న కోసం వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల నేడు ఎంతో బాధతో తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. కానీ దీనిని జగన్ ప్రతి కుటుంబంలో జరుగుతున్న గొడవ లాగానే చెబుతున్నాడు.. మొత్తంగా చూస్తే అటు విజయమ్మ, ఇటు భారతి మధ్య జగన్మోహన్ రెడ్డి నలిగిపోతున్నట్టు కనిపిస్తోంది. చూడాలి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాఫ్ పడుతుందో అని వైఎస్సార్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.