ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ పార్టీ..ఇప్పుడు తెలంగాణలోకూడా పూర్వవైభవం తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు.

వారంలో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో గడిపి, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో పార్టీతో ఉన్న అనేక నేతలను తిరిగి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పలువురు మాజీ నేతలు చంద్రబాబును కలవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో సైకిల్ పార్టీకి చేరాలనే ఆసక్తి పెరుగుతోంది.


ఇటీవల టీడీపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాని చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉండటం వల్ల ఈ కార్యక్రమం విపరీతమైన ఉత్సాహంగా సాగుతోంది. తెలంగాణాలో కూడా దీనిని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి, పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.


తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో, అక్కడి పలువురు నేతలు తిరిగి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సీనియర్ నేతలు చంద్రబాబును కలిశారు. గతంలో టీడీపీతోనే ప్రారంభించిన వారు ఇప్పుడు తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా, పార్టీపై ఆసక్తి ఉన్న నేతలను ఆకర్షించేందుకు చంద్రబాబు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా, బాబూ మోహన్ తాజాగా టీడీపీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.


ఇక పార్టీ సభ్యత్వాతు నమోదు చేయించేందుకు పార్టీ ఇన్‌ఛార్జిలను సైతం చంద్రబాబు నియమించారు. ప్రస్తుతం తెలంగాణ సభ్యత్వ నమోదు జరుగుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి సైకిల్ ఎక్కుతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇదే సమయంలో మాజీ హైదరాబాద్ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక వీరితో పాటు పలువురు టీడీపీ మాజీ నాయకులు సైకిల్ ఎక్కేందుకు చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: