దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయా అంటే కచ్చితమని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టంగా చెప్పేసింది. సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యత గురించి మాట్లాడారు. ఒకే దేశం అన్న నినాదం ఇచ్చారు. ఒకే దేశం ఒకే లక్ష్యం అందరి విధానం కావాలని అన్నారు.  ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో ముందుకు వెళ్తున్నట్లుగా మోడీ స్పష్టం చేసారు.


దేశమంతా ఒక్కటి అని చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికలతో దేశం మరింతగా బలపడుతుందని మోడీ చెప్పడం విశేషం. వన్ నేషన్ వన్ రేషన్ అన్న విధానంతో పేదలకు మేలు జరుగుతుందని అన్నారు. తొందరలొనే వన్ నేషన్ వన్ సివిల్ కోడ్ అన్న విధానాన్ని తీసుకుని వస్తామని కూడా ప్రధాని మోడీ చెప్పారు.


దీని వల్లనే దేశంలో వివక్షలు తెర పడుతుందని అన్నారు. నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు చూస్తే జమిలికి ముహూర్తం దగ్గర పడిందనే అనుకోవాలని అంటున్నారు.  2014 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చాక జమిలి ఎన్నికలను జరపాలని ఆలోచిస్తూ వస్తోంది. అది కాస్తా ఇపుడు కార్యరూపం దాల్చేలా కనిపిస్తోంది.


సాధ్యమైనంత త్వరలోనే ఒక దేశం ఒక ఎన్నికను అమలుపరుస్తామని కూడా ఆయన స్పష్టం చేసారు. అంతే కాదు దేశంలో జరిగే జమిలి ఎన్నికలను ఎవరూ అడ్డుకోలేరని కూడా ప్రధాని మోదీ ధీమాను ప్రకటించారు. ఈ విధంగా జమిలి ఎన్నికల గురించి ఖచ్చితంగా జరుగుతుందని ప్రధానమంత్రి మోడీ చెప్పడంతో మరోసారి జమిలి ఎన్నికల విషయం ఇపుడు దేశంలో మళ్ళీ చర్చకు వస్తోంది.

జమిలి ఎన్నికలకు కచ్చితంగా రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది అని అర్ధం అవుతోంది. జమిలి ఎన్నికలను యూపీ ఎన్నికలతో పాటుగానే జరిపిస్తారు అని అంటున్నారు. సో ఎన్నికల మీద మోడీ స్పష్టంగా చెప్పేసారు కాబట్టి ఇక జమిలికి దేశమంతా సిద్ధం కావాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: