వైసీపీలో కొందరు కీలక నేతలను ఫైర్ బ్రాండ్స్ గా పార్టీ జమ కట్టింది. జనాలు కూడా వారు వీర ఫైర్ అని డిసైడ్ చేశేసారు.  జగన్ మీద ఈగ వాలుతుందంటే చాలు వారంతా మీడియా ముందుకు వచ్చేసేవారు. ఒక్కొక్కరూ పులులు సింహాలు మాదిరిగా ప్రత్యర్ధులకు ఇచ్చే కౌంటర్లు చేసే హెచ్చరికలు చూసిన వారు అమ్మో నిప్పు కణికలే వీరంతా అనుకోవాల్సిందే.  అంత ఆవేశం జగన్ కోసమే అని వైసీపె క్యాడర్ అనుకునేది.


ఇదంతా గతంలో. ఇపుడు చూస్తే ఫైర్ లేదూ ఆ బ్రాండూ లేదు.  వారంతా ఎక్కడ ఉన్నారు అంటే ఏమో వారు ముఖ్య అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదేమో. నిజానికి ఫైర్ బ్రాండ్స్ కి కొత్త డెఫినిషన్ చెప్పిన పార్టీగా వైసీపీని చూడాలి. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ కి కొదవ అయితే లేదు పదుల సంఖ్యలోనే ఉంటారు. కానీ అక్కరకు రాని చుట్టం మాదిరిగా ఇపుడు పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు అవసరం అయిన వేళ మాత్రం ఈ ఫైర్ బ్రాండ్స్ కనిపించడం లేదు అని అంటున్నారు.


వారు కనీసం తమ సొంత నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టడంలేదు. ఫైర్ బ్రాండ్ కొడాలి నాని తన సొంత నియోజకవర్గంలో లేరు అని అంటున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నారని ప్రచారంలో ఉంది.  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన సొంత నియోజకవర్గం పుంగనూరుకు దూరంగానే ఉంటున్నారు అని అంటున్నారు. లేడీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరికి దూరంగా ఉన్నారు.


విజయవాడలో కీలక నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పార్టీ గొంతుకను వినిపించడం లేదు అని అంటున్నారు. . ఇలా వైసీపీ ఫైర్ బ్రాండ్ల లిస్ట్ చూస్తే కనుక ఏకంగా 50 నుంచి 60 మంది దాకా కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారని అంటున్నారు. తమ సొంత నియోజకవర్గాలలో రారాజులుగా పాలించిన వీరంతా ఇపుడు ఎక్కడా కనిపించడంలేదు అని అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: