భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక రోజు ముందు.. కొత్త దేశం పాకిస్థాన్ పుట్టింది. అప్పటి నుంచి పొరుగు దేశంతో మన సంబంధాలు సరిగా లేవు.

కొన్నేళ్లుగా పాకిస్థాన్ నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయి. అందులో పాకిస్థాన్ నుంచి వచ్చే కొన్ని రోజువారీ వస్తువులు కూడా ఉన్నాయి. అందులో రాక్ ఉప్పు ప్రధానం. నిజానికి రాళ్ల ఉప్పు కోసం భారత్ పూర్తిగా పాకిస్థాన్‌పైనే ఆధారపడి ఉంది.


భారత్‌లో రాక్ సాల్ట్ ఉత్పత్తి చాలా తక్కువ. అందుకే ఇది పాకిస్థాన్ నుంచి దిగుమతి అవుతుంది. భారతదేశంలో ఉపవాసాలు, మతపరమైన కార్యక్రమాలలో రాక్ సాల్ట్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. సముద్రం లేదా సరస్సు యొక్క ఉప్పునీరు సోడియం క్లోరైడ్ యొక్క రంగురంగుల స్ఫటికాలుగా మారినప్పుడు రాక్ ఉప్పు ఏర్పడుతుంది. పాకిస్థాన్‌లో దీని ధర కిలో 2-3 రూపాయలు. భారత్‌లో కిలో 50-60 రూపాయలకు విక్రయిస్తున్నారు.


2018-19 సంవత్సరంలో భారతదేశం యొక్క మొత్తం రాక్ ఉప్పు దిగుమతుల్లో 99.7 శాతం పాక్ నుంచి వచ్చింది. 2019-20 సంవత్సరంలో భారత్ పాక్ కు బదులుగా యూఏఈ నుంచి గరిష్టంగా రాతి ఉప్పును దిగుమతి చేసుకుంది. ఇరాన్, మలేషియా, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్, టర్కియే, ఆస్ట్రేలియా నుంచి కూడా రాతి ఉప్పును భారత్ దిగుమతి చేసుకుంటోంది. భారతదేశంలో రాక్ సాల్ట్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్లు కొచ్చి ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నాయి. భారతదేశంలోని దాదాపు 80 శాతం ఇళ్లలో దీన్ని వాడుతున్నారు.

 

సేంద్రీయ ఉప్పునే హిమాలయన్ ఉప్పు, రాళ్ళ ఉప్పు, పింక్ సాల్ట్ అని కూడా అంటారు. దీనిని హిమాలయ పర్వాతాల నుండి తయారుచేస్తారు. టేబుల్ సాల్ట్ కంటే ఇది చాలా మంచిది. ఇది గులాబీరంగులో ఉంటుంది. ఈ ఉప్పులో పొటాషియం, జింక్, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి గుణాలు ఉన్నాయి. దీనిని వాడడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా ఉపరాత్రి సమయంలో ప్రతి మీల్‌లోనూ 1. 5 గ్రాముల ఉప్పు తినాలి. దీనిని తినడం వల్ల pH లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. బాడీలో ఎలక్ట్రోలైట్స్ రీస్టోర్ అవుతాయి. ఇది హానికర ఖనిజాలని డీటాక్స్ చేసి రక్తప్రసణని పెంచుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: