అగ్రరాజ్యం అమెరికా.. ప్రపంచానికి పెద్దన్న. ఇక్కడ చదువుకోవాలని, స్థిరపడాలని, డాలర్లు సంపాదించాలని భారతీయులతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు కలలు కంటుంటారు. విద్యా, ఉపాధి పేరుతో అగ్రరాజ్యంలో అడుగు పెడుతున్నారు. అయితే అక్కడ ఎక్కువగా సంపాదిస్తున్నది మాత్రం భారతీయులేనట. ఈ విషయాన్ని అమెరికా సర్వే సంస్థలే చెబుతున్నాయి.


ఏ లక్ష్యంతో అయితే భారతీయులు వెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం కష్టపడుతున్నారు. అందుకే అమెరికా మాజీ అధ్యక్షుడు అనేవారు.. భారతీయులు లేకుంటే అమెరికా లేదని.  మనవాళ్లు టాలెంట్‌తో ఇతర దేశాల నుంచి వచ్చిన వారికన్నా ఎక్కువగా కష్టపడుతున్నారు. సంపాదిస్తున్నారు. యూఎస్‌ వెళ్లిన మనోళ్లు అక్కడి స్థానికులకన్నా ఎక్కువ పన్నులు కూడా చెల్లిస్తున్నారు.



అమెరికాలో ప్రస్తుతం భారతీయులు 40 లక్షల మంది ఉన్నారు. వీరిలో 16 లక్షల మంది వీసా హోల్డర్లు ఉన్నారు. 14 లక్షల మంది న్యూట్రలైజ్డ్‌ రెసిడెంట్లు. మరో 10 లక్షల మంది అక్కడే పుట్టినవారు. ఇక్కడి భారతీయ కుటుంబ మద్యస్థ ఆదాయం 1,23,700 డాలర్లు. ఇది దేశ సగటు(63,922)కు రెట్టింపు. యూఎస్‌లో 79 శాతం మంది ఇండియన్లు కాలేజ్‌ గ్రాడ్యుయేట్లు. ఇది దేశ సగటు 34 శాతం కన్నా రెండితలకుపైనే. ఇక మధ్యస్థ ఆదాయం విషయంలో తైవాన్, ఫిలిప్పీన్‌ కుటుంబాలు వరుసగా 97,129, 95 వేల డాలర్ల ఆదాయంతో మన తర్వాతి స్థానంలో ఉన్నాయి. 2019 నుంచి 2023 మధ్య భారతీయుల సగటు కుటంబ ఆదాయం 24 శాతం పెరిగింది. భారతీయుల ఆదాయం మాత్రం 18 శాతమే పెరిగింది.


అమెరికాలో భారతీయులు ఎక్కువగా సంపాదించడానికి కారణం.. కష్టపడే తత్వమే. ఐటీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ వంటి అత్యధిక వేతనాలు కలిగిన ఉద్యోగాల్లో మన వాళ్లే ఉన్నారు. ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ గోయెంకా ట్విట్టర్‌లో ఓ చార్ట్‌ను షేర్‌ చేశారు. ఇండియన్స్, అమెరికన్స్‌ మధ్యస్థ ఆదాయం లక్ష డాలర్లు ఉంటే.. ప్రస్తుత మారకపు విలువ ప్రకారం.. రూ.81.28 లక్షలుగా ఉంది. ఇక చైనీస్, అమెరికన్, పాకిస్తాన్, అమెరికన్‌ కుటుంబాల మధ్యస్థ ఆదాయం సుమారు 69,100, 66,200 డాలర్లుగా ఉందని కణాంకాలు పేర్కొంటున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: