ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలవబోతున్నారన్న టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది.


దీనికి కారణం ఫలితాల్ని తేలుస్తాయని భావిస్తున్న స్వింగ్ రాష్ట్రాల్లో సైతం ఎవరికీ స్పష్టమైన మెజార్టీ కనిపించకపోవడమే. ఇలాంటి తరుణంలో పలువురు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఛాట్ జీపీటీ అభిప్రాయం అడుగుతున్నారు.


2024లో అమెరికా అధ్యక్షులయ్యేది ఎవరని అడిగిన ప్రశ్నకు ఏఐ టూల్ ఛాట్ జీపీటీ తన జోస్యాన్ని వెల్లడించింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఛాట్ జీపీటీ డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ లలో ఎవరూ ఈసారి గెలవరంటూ మరో కొత్త ఫలితాన్ని చూపిస్తోంది. ట్రంప్, కమలకు బదులుగా "ఒక చీకటి గుర్రం నీడల నుండి అధికారాన్ని చేపట్టడానికి పైకి లేస్తుంది" అంటూ ఓ విచిత్రమైన అంచనాను ఛాట్ జీపీటీ సూచించింది.


దీంతో పాటు ఛాట్ జీపీటీ ఓ వివరణ కూడా ఇచ్చింది. "కానీ చివరి గంటలో, ఊహించని మలుపు, నిర్మలమైన సింహాసనాన్ని వీరిద్దరిలో ఎవరూ అధిష్టించలేకపోవచ్చని తెలిపింది. అనేక కథలలో చెప్పని పేరు శక్తికి మించి పెరుగుతుందని ఓ గందరగోళ వివరణ ఇచ్చింది.


ట్రంప్, కమల తమ శక్తి కొద్దీ పోరాడినప్పటికీ మరొకరు దేశానికి నాయకత్వం వహిస్తారని చెబుతోంది. వీరు రాత్రి బయటికి వస్తారంటూ వెల్లడించింది. వాస్తవానికి ట్రంప్, హారిస్ ఇద్దరూ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ లేదా ఓహియో సెనేటర్ జేడీ వాన్స్ వంటి ఇంటి పేర్లు లేని రన్నింగ్ మేట్‌ల మద్దతు పొందారు. వీరిద్దరిలో ఒకరు ఏఐ చెబుతున్న ఒకరు అవుతారా అన్న చర్చ సాగుతోంది.  ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరాగా సాగుతున్నాయి. ట్రంప్‌, కమలా హారిస్ లు పోటీపడుతూ.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తూ.. తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: