గత ఐదేళ్లలో ఒక బలమైన నినాదం తెరపైకి వచ్చింది. వై నాట్ కుప్పం అన్న స్లోగన్ వినిపించింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసిపి నేతలు శపధం చేశారు. ఒక్కరిద్దరు కాదు అందరిదీ అదే మాట.  2019లో చంద్రబాబుకు మెజారిటీ తగ్గింది కుప్పంలో. అటు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైసీపీ.   కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంది.



దీంతో వైసీపీకి ఎక్కడలేని ధీమా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఆ ధీమాతో చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో కూడా ఇబ్బందులు పెట్టింది వైసీపీ.  అన్నింటినీ భరిస్తూ.. క్యాడర్ను సమన్వయ పరుస్తూ.. ప్రజలకు జరిగినవన్నీ చెబుతూ ముందుకు సాగారు చంద్రబాబు. ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఏకపక్షంగా విజయం సాధించారు చంద్రబాబు. వైసీపీ కనుచూపుమేరలో కూడా కనిపించలేదు.


కుప్పం వైసీపీ బాధ్యతలను యువకుడు భరత్ కు అప్పగించారు జగన్. ఎమ్మెల్సీ పదవి సైతం కట్టబెట్టారు.  కుప్పంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించి.. ఆ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యవేక్షక బాధ్యతలు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించారు జగన్.  పెద్దిరెడ్డి సైతం పుంగనూరు కంటే కుప్పం పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో టిడిపి శ్రేణులకు భయాందోళనకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నారు. ప్రలోభాలకు సైతం గురి చేశారు.  ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో చంద్రబాబు గెలవకూడదన్న లక్ష్యంతో పని చేశారు జగన్, పెద్దిరెడ్డి త్రయం.  భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.  ఈసారి ఆయనను గెలిపిస్తే తప్పకుండా మంత్రిని చేస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. చంద్రబాబును మెజారిటీతో గెలిపించారు.


వై నాట్ కుప్పం అని నినాదం చేసిన ఒక్క నేత కూడా ఇప్పుడు కుప్పంలో లేరు.  భరత్ కనిపించడం లేదు. గతంలో ఇబ్బందులు పెట్టిన వారందరిపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో చాలామంది నేతలు టిడిపిలో చేరేందుకు ముందుకు వస్తున్నారు.  తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ టీడీపీలో చేరారు. ఈ బాటలోనే మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తోంది.  మొన్న ఆ మధ్య ఎమ్మెల్సీ భరత్ కూడా టీడీపీలో చేరేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం.  మొత్తానికైతే కుప్పంలో వైసీపీ పూర్తిగా ఖాళీ కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: