తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి అధికారమే లక్ష్యంగా పార్టీ చాలా వరకు కష్టపడింది. ప్రజలకు భరోసాలిచ్చి అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు... రేవంత్ రెడ్డి ఫైర్ కూడా పార్టీకి చాలా వరకు కలిసొచ్చింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచే పార్టీ పూర్తిగా ట్రాక్ లోకి వచ్చిందని అందరికీ తెలిసిందే. ఆయన చరిష్మా, గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు.


రేవంత్ అంటే ముందు నుంచీ అధిష్టానంలో మంచి అభిప్రాయమే కనిపించింది. కానీ.. ఈ మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, రేవంత్ మధ్య గ్యాప్ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  వారి ఆరోపణలను ఇప్పటివరకు అందరూ లైట్ తీసుకున్నప్పటికీ నిన్న రేవంత్ జన్మదినం సందర్భంగా మరోసారి రుజువైందని తెలుస్తోంది.  రేవంత్ రెడ్డి పుట్టినరోజు. దాంతో చాలా మంది విష్ చేశారు.  పార్టీలకతీతంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మాత్రం రేవంత్ పుట్టినరోజు అంశాన్ని పట్టించుకోలేదు. ఆయన కనీసం ట్విట్టర్ ద్వారా కూడా శుభాకాంక్షలు చెప్పలేదు.   వాళ్ల ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉన్నప్పటికీ.. ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.


ముఖ్యమంత్రికి రాహుల్ నేరుగా ఫోన్ చేసి విష్ చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ.. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా కనిపించకపోవడం విశేషం. సోషల్ మీడియాలో కాకుండా నేరుగా ఫోన్ చేసినట్లు వారు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం రాహుల్ ఫోన్ చేయలేదంటూ సెటైర్లు వేస్తోంది.



యంగ్ స్టర్ అయిన రేవంత్ ఫ్యూచర్‌లో దక్షిణాదిలో పిల్లర్‌గా మారుతారని భావిస్తున్న రేవంత్ రెడ్డిని దూరం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ హైకమాండ్‌కు అయితే లేదు. గతంలో వైఎస్సార్ ఎలా అయితే కాంగ్రెస్ పార్టీని నడిపించి అధికారంలోకి తీసుకొచ్చారో రేవంత్ కూడా అదే ధోరణిలో కనిపిస్తున్నారు. వైఎస్సార్ లాగే పార్టీని నడిపిస్తూనే.. వైఎస్సార్ లానే ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారన్న టాక్ ఉంది. కానీ.. బీఆర్ఎస్ మాత్రం మరొలా ఉంది. రేవంత్‌ను ఎలా అయినా హైకమాండ్‌కు దూరం చేస్తే.. ఆయన నమ్మకం తగ్గిస్తే చాలనే కాన్సెప్టుతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఒకవేళ హైకమాండ్‌తో రేవంత్‌కు ఏమైనా గ్యాప్ ఏర్పడితే దానిని కన్విన్స్ చేసుకునే అంత కెపాసిటీ కూడా ఆయనకు ఉంది. అంతే తప్పితే హైకమాండుతో వివాదం పెంచుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ.. బీఆర్ఎస్ మాత్రం రేవంత్‌ను కార్నర్ చేస్తూ ఆయన పోస్టుకు ఎసరు తేవాలనే ప్రయత్నాలు మాత్రం వదలడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: