తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. అటు ఏ సమయంలో ఏ నేత అరెస్టు అవుతారా అన్న టెన్షన్ కూడా అలానే కనిపిస్తోంది.


ఈ -కార్ రేసింగులో ఆధారాలు లభ్యం కావడం.. కేటీఆర్ ఈ కేసులో కీలకంగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. తెలంగాణ రాజకీయాలతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఫార్ములా ఈ -కారు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌ ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు.  రేవంత్, పొంగులేటిని జైలుకు పంపిస్తానంటూ ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.  ఓ టెండర్ల అంశంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.


కేటీఆర్ ఫిర్యాదు చేసినంత మాత్రాన కేంద్రం వీరిద్దరిపై యాక్షన్‌కు దిగుతుందా అంటే అది అనుమానాలు కలిగించే అంశమే అని చెప్పాలి. కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక కాంగ్రెస్ నేతల ఆరోపణలు మరో విధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ-కార్ రేసు కేసు చివరి దశకు చేరుకుందని, కేటీఆర్‌ను ఎప్పుడైనా విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని వారు అంటున్నారు. అందుకే.. దాని నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.


మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కీలక నేతలను అరెస్ట్ చేయాలంటే బీజేపీ పర్మిషన్ తప్పనిసరి అనే టాక్ నడుస్తున్నది.  ప్రభుత్వం జరిగిన అవినీతిపైనా చర్యలు తీసుకునేందుకు, విచారించేందుకు కేటీఆర్‌ను పిలవాలంటే గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి.


ఫార్ములా ఈ -కారు రేసు వ్యవహారంలో రూ.55 కోట్లు ఆర్థిఖ శాఖ అనుమతులు లేకుండానే విదేశీ కంపెనీలకు మళ్లించారు.  కేవలం నోటిమాటగా కేటీఆర్ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి చెబితే.. వాటిని రిలీజ్ చేశారు. అందుకే.. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు కాంగ్రెస్ అగ్రెసివ్‌గా ముందుకు సాగుతోంది. గవర్నర్‌ను పర్మిషన్ కోసం 15 రోజులు అవుతున్నదని, ఇంతవరకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ చెప్పారు. పర్మిషన్ రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అటు.. కేటీఆర్ మాత్రం రేవంత్, పొంగులేటిలను అరెస్ట్ చేపిస్తానంటూ తిరుగుతున్నారు. వీరి వివాదాల ప్రకారం వచ్చే వారంలో ఖచ్చితంగా సెన్సేషనల్ జరగబోతున్నదనే అర్థం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: