టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఒంటికాలి మీద వైసీపీ అధినేత లేస్తారు. అలాంటిది చంద్రబాబు గ్రేట్ అని ఆయన నోటి వెంట వస్తే ఆశ్చర్యపోవాల్సిందే.  అయితే ఆయన నిజంగా పొగిడారా అంటే అక్కడ ఉంది మ్యాజిక్.  పొలిటికల్ గా చంద్రబాబుతో వైరం కొనసాగిస్తున్న జగన్ ఆయనను మెచ్చుకుంటారు అంటే అది అసలు జరిగేది కాదు.


చంద్రబాబు యాక్టింగ్ అదరహో అంటున్నారు జగన్. జగన్ దృష్టిలో చంద్రబాబు యాక్టరేనట. అలా ఇలా కాదు అతి పెద్ద యాక్టర్ అని జగన్ అంటున్నారు. చంద్రబాబు  యాక్టింగ్ ముందు ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ కూడా సరిపోదని అన్నారు.  అంతటి మహత్తరమైన నటన చంద్రబాబుకే సాధ్యం ఆయనకే సొంతం అంటూ జగన్ ఆయనని ఆ విధంగా కీర్తిస్తున్నారు.


ఇది నిజంగా పొగిడినట్లా అని ఇపుడు ఆలోచించాలి మరి.  జగన్ అన్నది చంద్రబాబు మహా నటుడు అని. ఆయన జనాలను తన హామీలతో బురిడీ కొట్టిస్తూ అధికారంలోకి వస్తుననరు తప్ప ఆయన ఏమీ చేయడంలేదని. మొత్తానికి అయితే చంద్రబాబు గొప్ప నటుడు అని జగన్ ఒప్పుకున్నారు.


అంతే తప్ప గొప్ప పాలకుడు ఆయన కానే కారని అంటున్నారు. ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కారని, బడ్జెట్ లో ఏ ఒక్క హామీని పెట్టలేదని ఘాటుగానే నిందించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా బడ్జెట్ ని పూర్తి స్థాయిలో పెట్టలేదని, తీరా పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఎన్నికల హామీలు అన్నీ అందులో లేకుండా పోయాయని అన్నారు. ఇక అప్పుల విషయంలో ఎన్నో చెప్పారని అవన్నీ తప్పులు అని బాబు తన బడ్జెట్ ద్వారానే ఒప్పుకున్నట్లు అయింది అని జగన్ అంటున్నారు.


ఏపీ అప్పులతో శ్రీలంకతో పోటీ పడుతోందని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ విషం చిమ్మారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సూపర్ సిక్స్ హామీలను ఎగరగొట్టడానికి ఏపీ అప్పులు అని మళ్లీ చెప్పుకొచ్చారని అన్నారు. ఓటాన్ అకౌంట్ అని చెప్పి గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారని విమర్శించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: