ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాడు చేసిన పాపం నేడు వారికి శాపంగా మారుతోంది. కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై వైసీపీ లీగల్ సెల్ సేవలందిస్తోంది. ఈ క్రమంలో బాధ్యత కుటుంబ సభ్యులతోహైకోర్టులో పిటిషన్లు వేయించింది లీగల్ సెల్.


విచారణలో కనీస నిబంధనలు పాటించడం లేదని..ఆహారం కూడా అందించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తక్షణం విచారణకు సంబంధించి సీసీ పూటేజీలను ఇవ్వాలని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు ఇచ్చింది. అంతకుమించి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో వైసీపీలో నిరాశ కలిగింది. ఈ తరుణంలో మరో ప్రజా ప్రయోజన వాజ్యం ఒకటి హైకోర్టులో దాఖలయింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తమను కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు వెలిసిన విషయాన్ని పిటిషనర్ కు గుర్తుచేసింది.


త్వరలో దీనిపై ఉత్తర్వులు ఇస్తామని కూడా చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసు పెడుతున్నారంటూ మాజీ సమాచార శాఖ కమిషనర్ విజయబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు పెడితే తప్పు ఏముందని ప్రశ్నించింది. గతంలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా పోస్టులు పెట్టిన విషయాన్ని గుర్తు చేసింది.


2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వపరమైన నిర్ణయాలకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి.  దీంతో ప్రభుత్వం ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చేది. దీనిపైనే వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయేది. రకరకాల నిందలు మోపి న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది.  ఇప్పుడు అదే విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు గుర్తు చేశారు. అందుకే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంలో పోలీసు చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

 


పోలీసుల కేసులపై అభ్యంతరాలు ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టుకు ఆశ్రయించవచ్చని సూచించింది.  పోలీసులు చట్టపరంగా, నిబంధనలకు అనుగుణంగా వెళ్తుంటే తాము ఎలా నిలువురించగలమని వ్యాఖ్యానించింది. దీంతో పిటిషనర్ కు చుక్కెదురు అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: