మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మార్చారు. కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నాలుగు వైపులా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ జగన్ సైతం కొత్త సవాళ్లకు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో పాటుగా పారిశ్రామిక ఒప్పందాల పైనా స్పందించారు.  చంద్రబాబు మోసం చేసారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు.


జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవటం పైన కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.  తమ పార్టీ మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో ఉండటంతో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్ లో నిధులు అవసరం మేరకు కేటాయించకపోవటాన్ని ప్రశ్నించారు.


చంద్రబాబు మోసం చేసారంటూ జగన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ట్వీట్లు పోస్టు చేసారు.  పార్టీ అభిమానులు అందరూ చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టులు చేయాలని సూచించారు. ఈ పోస్టుల పైన అరెస్టులు మొదలైతే తన నుంచే మొదలు పెట్టాలని సవాల్ చేసారు. అనర్హత వేటు వేస్తారా.. రెడీ, చేయమనండీ..తాను సిద్దమంటూ జగన్ సవాల్ చేసారు. అనర్హత వేటు వేయటం వీళ్ల చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రస్తుతం చెబుతున్న పెట్టుబడులు అన్నీ తమ హాయంలో చేసుకున్న ఒప్పందాలేనని చెప్పుకొచ్చారు.


పార్టీ ఓటమికి కేడర్ ను జగన్ పట్టించుకోకపోవటం.. జనంతో కలవకపోవటం ప్రధాన కారణాలుగా పార్టీ సమీక్షల్లో తేల్చారు. దీంతో..ఇప్పుడు కూటమి జగన్ లక్ష్యంగా రాజకీయ దాడి పెంచటంతో, ఇక తాను అదే స్థాయిలో కౌంటర్ చేయాలని జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాలను గమనిస్తూ స్పందించాలని డిసైడ్ అయ్యారు. ఇక.. జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. జనవరి నుంచి వరుసగా జిల్లాల్లో పార్టీ సమావేశాలతో పాటుగా.. జనంలోకి వెళ్లేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అసెంబ్లీ బహిష్కరించి.. పాదయాత్ర ద్వారా అధికారంలోకి రావటంతో.. ఇప్పుడు సైతం ప్రజల్లోనే ఎక్కువగా ఉండేందుకు జగన్ సిద్దం అవుతున్నారు. జగన్ దూకుడు పెంచటంతో ఇప్పుడు కూటమి నేతలు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది



మరింత సమాచారం తెలుసుకోండి: