తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి నేతలు మొన్నటి వరకు పాదయాత్రలు చేశారు. 2003లో వైఎస్‌ఆర్ పాదయాత్ర చేపట్టి సీఎం అయ్యారు. 2013లో జగన్ కూడా ఏపీలో పాదయాత్ర చేసినా.. 2014లో అధికారంలోకి రాలేదు. 2018 మళ్లీ యాత్ర చేశారు. ఈసారి అధికారం వరించింది.
2024ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. దీంతో ఆశించిన ఫలితాలు వచ్చాయి.ఇక జైలుకు వెళ్లినా సీఎం అవుతామనే అభిప్రాయం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయకుడు, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లొచ్చాక సీఎం అయ్యారు. పాదయాత్ర చేయడం కష్టమైన పని, జైలుకు వెళ్లడం ఈజీ బాగా విశ్రాంతి దొరకడంతోపాటు మైలేజీ వస్తుంది. ఇది కేసీఆర్, జగన్‌కు బాగా అర్థమైంది. రేవంత్‌ను అరెస్టు చేయించిన కేసీఆర్ పార్టీని గెలిపించలేదు. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ కూడా పార్టీని గెలిపించలేకపోయారు. దీంత ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కీలక నేతల జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు.
కేటీఆర్, జగన్ తాము మళ్లీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయాలి లేదా జైలుకు వెళ్లాలని భావిస్తున్నారు. పాదయాత్ర ఇప్పుడు కష్టంగా ఉంది. దీంతో జైలుకు వెళ్లడమే మేలని భావిస్తున్నారు. ఫార్ములా-1 ఈ రేసింగ్ వ్యవహారంలో తాను జైలుకు వెళ్లడానికి రెడీ అని కేటీఆర్ అంటున్నారు. జైల్లో యోగా చేసి ఫిట్‌గా మారి రెండు నెలల్లో బయటకు వస్తానని చెప్పుకుంటున్నారు. తర్వాత పాదయాత్ర చేస్తానని అంటున్నారు.
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తోంది. దీంతో వైసీపీ అధినేత జగన్ అరెస్టు చేయదలిస్తే.. ముందుగా తనతోనే మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇక అసెంబ్లీలో అడుగు పెడితే అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే అనర్హత వేటు వేయాలని సవాల్ చేశారు.
ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎస్, వైసీపీలు రెండు రాష్ట్రాల్లో డీలా పడ్డాయి. వాటిని జాకీలు పెట్టి లేపేందుకు నేతలు యత్నిస్తున్నారు. క్యాడర్‌లో ధైర్యం నింపేందకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న నేతల అరెస్టుతో లాభం ఉండదని, తాము జైలుకు వెళితే పార్టీల్లో భావోద్వేగాలు రగిలి మళ్లీ ఉత్సాహం వస్తుందని కేటీఆర్, జగన్ భావిస్తున్నారు.