ప్రతి ఆదివారం తన పత్రికలో కొత్త పలుకు పేరుతో రాధాకృష్ణ కొన్ని కొన్ని విషయాలను రాస్తుంటారు. తను ఏం చెప్పాలనుకుంటున్నారో.. అదే విషయాన్ని కుండబద్దలు కొట్టేస్తారు. తాజా కొత్త పలుకులో మాజీ ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్మోహన్ రెడ్డిని లెఫ్ట్ రైట్ తీసుకున్నారు. లెఫ్ట్ పార్టీలను కడిగిపారేశారు. రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ను, పవన్ కళ్యాణ్ ను కాపాడే ప్రయత్నం చేశారు.
”వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. అహంకారాన్ని నింపుకున్నారు. ఇప్పుడు అధికారం పోయేవరకు హాహాకారం చేస్తున్నారు.. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడొద్దు. వ్యవస్థల ధ్వంసం గురించి మీరు చెప్పొద్దు. అధికారం కోల్పోయేసరికి మొత్తం దారుణం కనిపిస్తోంది.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసుకొని విధంగా కేసీఆర్, జగన్ మీడియా వ్యవస్థలను నెలకొల్పారు. వాటి వల్ల మీడియా మొత్తం సర్వనాశనం అయిందని” రాధాకృష్ణ రాసుకొచ్చారు.
ఈసారి విజయసాయిరెడ్డి మీద పడిపోయాడు. అది కూడా ఓ రేంజ్ లో.. ”ఏమోయ్ విజయసాయిరెడ్డి నువ్వు మనిషివేనా.. అసలు నీది మనిషి పుట్టుకేనా.. ఎంత కావాలని నన్ను అడుగుతావా.. నా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావో లెక్క చెప్పనా.. నాతో ఏం మాట్లాడాలో బయటకు తీయనా.. నేను నిజాయితీగల మనిషిని.. నేను తప్పులు చేస్తే జగన్ ఊరుకుంటాడా.. నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. నన్ను ఏం చేయగలిగారు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు..
నువ్వు నా ఓపెన్ హార్ట్ ప్రోగ్రాం కి రా.. నీ సాక్షి ఛానల్ లో కూడా దాన్ని టెలికాస్ట్ చెయ్. నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం” అనే స్టైల్లో రాధాకృష్ణ విజయ సాయి రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. రాధాకృష్ణ ఇటీవల కాలంలో ఎవరి మీద ఈ స్థాయిలో విరుచుకుపడలేదు. మరి అలాంటిది రాధాకృష్ణ ఎందుకు ఆ స్థాయిలో రాశాడు? విజయ్ సాయి రెడ్డికి ఆ స్థాయిలో ఎందుకు సవాల్ విసిరాడు? అనేవి మీడియా వర్గాలలో చర్చకు దారితీస్తున్నాయి.