ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందా ? ఆయనపై విద్రోహులు దాడి చేయనున్నారా?హతమార్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారా?కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
రాజకీయంగా పవన్ కళ్యాణ్ రోజురోజుకు బలోపేతం అవుతున్నారు. జాతీయ అంశాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు మరింత బలోపేతం కావాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో హిందూమత పరిరక్షణ గురించి బలంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు వ్యక్తులు, వ్యవస్థలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. అయితే వాటిని పట్టించుకోని పవన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
రాష్ట్రంతో పాటు జాతీయస్థాయిలో సైతం ప్రత్యర్థులు పెరుగుతున్నారు. అందుకే ఆయన ప్రాణాలకు ముప్పు అని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కుల, మత, ప్రాంతీయ అంశాల్లో పవన్ కు వ్యతిరేకులు, ప్రత్యర్థుల నుంచి హాని ఉంటుందన్నది నిఘా వర్గాల హెచ్చరిక. అయితే గతంలో కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు పవన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై దాడి కూడా జరుగుతుందని.. హతమార్చేందుకు ప్రయత్నాలు సైతం జరుగుతాయని అనుమానం వ్యక్తం చేశారు పవన్. ఇప్పుడు దానినే ధ్రువీకరిస్తున్నాయి నిఘా వర్గాలు.
భిన్న మతాలు, భిన్న జాతుల కేంద్రం భారతదేశం. అయితే సువిశాల హిందూ దేశం కూడా మనదే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల పరిరక్షణ ధ్యేయంగా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కట్టారు పవన్. ఈ క్రమంలో హిందూ మతం వ్యతిరేక వర్గాలకు ప్రత్యర్థిగా మారారు. అందుకే ఇప్పుడు పవన్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు పవన్. పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది.
అయితే దీని వెనుక పవన్ ఇచ్చిన సనాతన ధర్మ పరిరక్షణ పిలుపు ఉందన్నది ఒక విశ్లేషణ. దీంతో పవన్ జాతీయస్థాయిలో సైతం ప్రభావం చూపగలరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే పవన్ కు ఇబ్బందికరంగా మారింది. ఆయనను హతమార్చాలని ప్రత్యర్థులు భావిస్తున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు సంబంధించి ఎటువంటి ధృవీకరణలు లేవు. అందుకే ఇందులో ఎంత వాస్తవం ఉందో అన్నది తెలియాల్సి ఉంది.