ఏడాది పరిపాలన పూర్తయిన తర్వాత ఎవరికైనా కూడా ఆత్మ పరిశీలన ఉంటుంది.   మరి రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతోంది? ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? హైకమాండ్ లక్ష్యాలను సాధించారా? ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు?


రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో ప్రభుత్వ అధినేతగా తన మార్క్ చూపించడంతోపాటు.. మార్పును కూడా ప్రజలకు అనుభవంలోకి తెచ్చారు.  ఆర్థిక కష్టాలు ఉన్నా.. రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ చేసి సరికొత్త ఘనత సృష్టించారు.  తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించారు.  మూసీని సుందరీకరించేందుకు అడుగులు పడుతున్నాయి. వచ్చే 50 సంవత్సరాల అవసరాలు తీర్చే విధంగా హైదరాబాదు నగరం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణానికి రేవంత్ ముందడుగు వేస్తున్నారు.



కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలను పెంచింది రేవంత్ ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ప్రపంచ స్థాయిలోనే విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.  మీడియాకు స్వేచ్ఛ కల్పించారు. మాదకద్రవ్యాలపై ఉక్కు పాదం మోపారు. పెట్టుబడులను కూడా భారీగా ఆకర్షిస్తున్నారు.  టైర్ -2 పట్టణాలలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి.  ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి వ్యక్తి పది లక్షల రూపాయల విలువైన ఉచిత వైద్యం అందించేందుకు ప్రణాళికలు పొందుతున్నాయి.  ప్రతినెల ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు లభిస్తున్నాయి.  


లగచర్ల, హైడ్రా, మూసీ నది వెంబటి నిర్మాణాలను పడగొట్టడం, ప్రభుత్వ వసతి గృహాల్లో నాసిరకమైన ఆహారం విద్యార్థులకు పెట్టడం, రుణమాఫీ కొంతమందికి కాకపోవడం వంటివి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి.  రైతు భరోసా కూడా ప్రభుత్వం ఖాతాలలో జమ చేయకపోవడం ఒకింత ఇబ్బందిగా మారింది.  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడం లబ్ధిదారుల్లో అసహనాన్ని కలిగిస్తోంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా నిలిచాయి.



మొత్తంగా చూస్తే తొలి ఏడాది రేవంత్ రెడ్డికి కేక్ వాక్ కాకపోయినప్పటికీ.. మరి తీసిపారేదగ్గ పరిపాలన మాత్రం కాదని విశ్లేషకులు అంటున్నారు. తొలి ఏడాది రేవంత్ రెడ్డి 100కు 75 మార్కులు తెచ్చుకున్నారని చెబుతున్నారు.. పరిపాలనలో మరింత నూతన ఒరవడి కొనసాగిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: