ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. జనసేనాని పవన్ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీని సంస్థాగతంగా బలం పెంచుకునేలా కొత్త వ్యూహా లతో సిద్దం అవుతున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ మరింత బలోపేతం కావాలని భావిస్తోంది. ఈ సమయంలోనే బీజేపీ కొత్త ఎత్తుగడలతో ఆపరేషన్ ఏపీకి రెడీ అవుతోంది. ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయం జరగనుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో జమిలి నాటికి తమ పట్టు పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణతో పాటుగా ఏపీలో నూ తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీకి గతం కంటే భిన్నంగా కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ బీజేపీ ముఖ్య నేతలు పవన్ కు ప్రయార్టీ పెంచుతూ కొత్త సంకేతాలు ఇస్తున్నారు.
బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఆర్ క్రిష్ణయ్య తాజాగా వైసీపీకి రాజీనామా చేసారు. ఆయన్ను బీజేపీలో చేర్చుకోనుంది. క్రిష్ణయ్య ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీ వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో పవన్ తో సంబంధాలు భవిష్యత్ కు ఉపయోగపడేలా ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తోంది. పవన్ తాజా ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలు ఇచ్చిన ప్రాధాన్యత కొత్త చర్చకు కారణం అవుతోంది.
ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు నియామకం కాను న్నారు. బీజేపీ అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమించా లని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గాలను దగ్గర చేసుకోవటం పైనా గురి పెట్టింది. పవన్ సనాతన ధర్మం నినాదం.. పవన్ తరచూ స్పందిస్తున్న విధానంతో తమకు జనసేన తో కలిసి వస్తుందని లెక్కలు వేస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో బీజేపీ ఏపీలో తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచనున్నాయి.