చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఆ పార్టీ ఓటమి పాలయినా అందులో బలమైన నాయకులు ఉన్నారు. కూటమి వేవ్ కారణంగా వారు ఓటమి పాలు అయ్యారు కానీ మళ్లీ ఎన్నికలు వస్తే గెలుస్తారు అన్నది కూడా అంచనాలు ఉన్నాయి. దాంతో అలాంటి వారిని ఎంపిక చేసుకుని మరీ చంద్రబాబు వారిని టీడీపీలోకి తీసుకుంటున్నారు. వీరిపై సొంత పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా చంద్రబాబు వారికి నచ్చచెప్పి మరీ పార్టీ తీర్ధం ఇస్తున్నారు.
ఈ సారి 2026 లో ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంది 225 దాకా పెరుగుతాయని అంటున్నారు. సీట్లు ఇంత పెద్ద మొత్తంలో పెరిగితే అది అధికారంలో ఉన్న టీడీపీకే మంచిది అని అంటున్నారు. చంద్రబాబు సైతం సీట్లు పెరిగే నియోజకవర్గాల్లో కొత్త నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అని అంటున్నారు. వారి చేరికతో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు వైసీపీని రెండిందాల దెబ్బ తీయాలన్న ప్లాన్ ఉందని అంటున్నారు.
ఒకటి రాజకీయంగా రెండు సామాజిక వర్గ పరంగా అని అంటున్నారు. రాజకీయంగా వైసీపీని బలహీనం చేసే ప్లాన్ కూడా ఇందులో ఉంది. వైసీపీకి బలమైన నేతలు ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో లేకుండా పోతున్నారు అని అంటున్నారు. ఇపుడు ఉన్న వారిని లాగేస్తే రేపు 225 అసెంబ్లీ సీట్లుగా మారితే అంతమంది స్ట్రాంగ్ లీడర్స్ వైసీపీకి దొరకకుండా చేయడమే టీడీపీ ప్లాన్ అని అంటున్నారు.
ఏలూరులో ఎంతో మంది నాయకులు నో చెప్పినా కూడా మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నానిని పార్టీలోకి బాబు ఆహ్వానించారు అని అంటున్నారు. ఆళ్ నానికి క్లీన్ ఇమేజ్ ఉండడంతో పాటు అంగబలం అర్ధ బలం ఉన్న నాయకుడుగా ఉన్నారు గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి వారిని కూడా పార్టీలో చేర్చుకుంటారని టాక్ నడుస్తోంది. మొత్తానికి కోస్తా జిల్లాలలతో పాటు ఉత్తరాంధ్రాలో వైసీపీని దెబ్బ తీసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది అని అంటున్నారు. మరి దీనిని ఎలా వైసీపీ అధినాయకత్వం కాచుకుని ఎత్తుకు పై ఎత్తు వేస్తుందో చూడాల్సి ఉంది.