కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి నెలకొందని.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రజా వ్యతిరేకత మొదలైందని.. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు బలం చేకూర్చే రీతిలో ప్రజా సమస్యల పరిష్కారం పేలవంగా ఉందనే విషయం తెరపైకి వచ్చింది.  


ఈ ఏడాది జూన్ లో ప్రజల విజ్ఞప్తుల పరిష్కారానికి.. నవంబర్ నాటికి వచ్చేసరికి జరిగిన పరిష్కారాలకూ ఏమాత్రం సంబంధం లేదని.. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అంటున్నారు.  ఈ విధంగా పరిష్కారాలకు నోచుకోని వినతులు ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, టౌన్ ప్లానింగ్ తో పాటు మరికొన్ని శాఖల్లో ఉన్నాయని అంటున్నారు.


జూన్ విజ్ఞప్తుల పరిష్కార చర్యలపై 69.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. అది నవంబర్ నాటికి 35.22 శాతానికి పడిపోయిందని అంటున్నారు. అధికారుల చర్యలు మొక్కుబడిగానే ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందని అంటున్నారు.  


జూన్ 15 నుంచి నవంబర్ నెలాఖరు వరకూ వచ్చిన వినతులు 1.69 లక్షలు ఉండగా.. వీటిలో 1.39 పరిష్కరించినట్లు చెబుతున్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. కానీ.. ఆ పరిష్కారం అంతా మొక్కుబడిగానే ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయని చెబుతున్నారు!


ఈ ఏడు నెలల్లో వచ్చిన ఫిర్యాదుల్లో 20,702 ఆస్తులకు సంబంధించినవి కాగా.. 16,240 ఫిర్యదులు పోలీస్ శాఖకు సంబంధించినవని అంటున్నారు. ఇక భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య 9,577 గా చెబుతున్నారు. ఇక నేరుగా చంద్రబాబు స్వీకరించిన ఫిర్యాదులు 6,784 ఉన్నాయి. సీఎంఓ మెయిళ్ల ద్వారా వచ్చినవి 741 అని అంటున్నారు!


జూన్ నుంచి నవంబర్ వరకూ నెలల వారీగా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల సంతృప్తి వరుసగా తగ్గుతూ వస్తుందని అంటున్నారు. ఈ వివరాలు నెలలవారీగా చూస్తే... జూన్ (69.96%), జూలై (64.61%), ఆగస్టు (55.12%), సెప్టెంబర్ (49.49%), అక్టోబర్ (50.36%), నవంబర్ (35.22%) చొప్పున ఉంది.


ఇక శాఖలవారీగా పరిష్కార చర్యల్లో అసంతృప్తి విషయానికొస్తే...  పోలీసు శాఖ - 49.76%, రెవెన్యూ శాఖ - 48.88%, మున్సిపల్ - 43.94%,  విద్యాశాఖ - 42.12%,  పౌరసరఫరాల శాఖ - 42.10% , పంచాయతీ - 40.07%, ఇంధనం - 32.55%, హౌసింగ్ - 26.17%, ఆరోగ్య శాఖ - 26.07%, వ్యవసాయం - 25.71%  స్థానాల్లో ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: