చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు సరితూగే నేతలు బహు తక్కువగా ఉంటారు. ఆయన స్కెచ్ గీసారు అంటే అది పారాల్సిందే. గత ఎన్నికల్లో పరాభవానికి అయిదేళ్ళు తిరగకుండానే వడ్డీతో సహా చెల్లించేశారు. తనకు దక్కిన సీట్ల కంటే కూడా సగానికి ఒకటి తక్కువ చేసి మరీ వైసీపీని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు.
దానికి కారణం 2019లో చేసిన తప్పులు 2024లో చంద్రబాబు చేయలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ ని అక్కున చేర్చుకున్నారు. అందుకే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. మళ్లీ ఇదే తరహా విజయం దక్కాలీ అంటే ఈ రెండు పార్టీలు తనతోనే ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన ఇవే పొత్తులు సుదీర్ఘ కాలం కొనసాగుతాయని ప్రకటిస్తున్నారు.
అందుకే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పొత్తులు జనం కోసమే అని అంటున్నారు. మరోవైపు వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలీ అంటే కచ్చితంగా ఈ పొత్తులు ఉండాలని పవన్ కూడా భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక జనసేన ఏపీ పాలిటిక్స్ లో పూర్తిగా ఎమర్జ్ కావాలీ అంటే వైసీపీ అన్నది పొలిటికల్ స్క్రీన్ మీద ఎలిమినేట్ కావాలని అంటున్నారు.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు షేర్ దక్కింది. 175 నియోజకవర్గాల్లో పార్టీ ఉంది. క్యాడర్ ఉంది. అందువల్ల జనసేన మైనస్ టీడీపీ అయితే కచ్చితంగా అది జగన్ కి భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నది కూడా పవన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. అది 2019లో రుజువు అయింది కూడా.
అందుకే బీజేపీని కూడా కలుపుకుని పటిష్టమైన కూటమిగా 2029లోనూ పోటీ చేయాలన్నది పవన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఇప్పట్లో జనసేన సింగిల్ గా పోటీ చేసినా అధికారంలోకి రాలేదు అని అంటున్నారు. అదే వైసీపీని దెబ్బ తీస్తే ఆ పొలిటికల్ స్లాట్ లోకి జనసేన వెళ్తుందని అపుడు టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయం మారినా తమకు కలసి వస్తుందని ఆలోచనతోనే ఆయన ఇలా అంటున్నారు అని చెబుతున్నారు.