తెలంగాణ  ఏర్పడిన నాటి నుంచి పదేళ్లు రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ పాలించింది.  కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 2023 ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. గులాబీ పార్టీని   39 స్థానాలకు పరిమితం చేశారు.  కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. దీంతో బీఆర్‌ఎస్‌కు కష్టాలు మొదలయ్యాయి.  ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు.



లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క ఎంపీ సీటును కూడా గెలిపించలేదు. ఏడాది ప్రారంభంలోనే కేసీఆర్‌ కాలుజారి పడ్డాడు.   ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయ్యారు.  సుమారు  6 నెలలు తిహార్‌జైల్లో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లపై నియమించిన కమిషన్లు విచారణ జరుగుతోంది. తాజాగా ఈ ఫార్ములా రేసుకు సంబంధించి రూ.54 కోట్లు కేటాయింపు విషయంపై తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.


2025లో బీఆర్‌ఎస్‌కు మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  విచారణ కమిషన్లు మరో నెల రోజుల్లో నివేదిక ఇవ్వనున్నాయి.  వాటి ఆధారంగా గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు, మాజీ సీఎం కేసీఆర్‌పైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈరేస్‌ కేసుపై జనవరిలో ఏసీబీ విచారణ చేయడంతోపాటు కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఔటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌ కాంట్రాక్టుపై సిట్‌ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ విచారణలోనూ కేటీఆర్‌కు చిక్కులు తప్పేలా లేవు.


పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయినా అతి విశ్వాసంతో కష్టాలు తెచ్చుకుంటోంది. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై విచారణ జరిపించాలని హరీశ్‌రావే డిమాండ్‌ చేశారు. ఇక ఈ కార్‌ రేసులో తప్పు చేయలేదని, కేసు పెడితే పెట్టుకోండి అని కేటీఆరే అన్నారు. కేసు నమోదు చేసి, సిట్‌ ఏర్పాటు చేసిన తర్వాత గగ్గోలు పెడుతున్నారు.


ముఖ్య నేతలు కేసుల పాలవుతుండడంతో గులాబీ పార్టీ కేడర్‌లో మరోమారు గందరగోళం నెలకొంది.  ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఈ తరుణంలో ఆ పార్టీ నేతల తీరు, కేసుల పాలవుతుండడం, కేసీఆర్‌ బయటకు రాకపోవడం, ముఖ్యనేతలు అరెస్ట అయితే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన కనిపిస్తోంది.  ముఖ్య నేతలు అరెస్ట్‌ అయితే పార్టీ కేడర్‌ చీలిపోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs