పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సాధించింది.  ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది.  పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే… అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ కావడం.. అరెస్టు అవడం బెయిల్‌ పై బయటకు రావడం చకచకా జరిగిపోయాయి. 


ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పైన విపరీతంగా ఫైర్ అయ్యాడు.  తాను సీఎం పదవిలో ఉన్నన్ని రోజులు ఒక్క సినిమాకి కూడా బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చేది లేదని టికెట్ రేటు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వబోనని తెలియజేశాడు.   మొత్తానికైతే ఆయన సినిమా ఇండస్ట్రీ మీద నెగిటివ్ గా స్పందిస్తున్నారు అంటూ కొంతమంది అంటుండగా.. సినిమా కోసం ప్రాణాలను తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకోసమే సీఎం గారు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని పలువురు సమర్థిస్తున్నారు.



రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ జైలుకు పోయి వచ్చిన తర్వాత అతనికి కాలు తిరిగిందా? కన్ను పోయిందా? చేయి విరిగిందా? కిడ్నీలు పాడైపోయాయా? ఎందుకోసమని అతన్ని అందరూ వచ్చి పరామర్శిస్తున్నారు. అతను ఒక్కరోజు జైల్లో ఉన్నందుకు నన్ను దూషిస్తూ అతని పరామర్శించడం ఎందుకు శ్రీ తేజ్ అనే పిల్లవాడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతని కోసం ఒక్కరోజన్నా ఎవరైనా వెళ్లి అతన్ని కలిసారా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు.


రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి చాలా మంచి సన్నిహితుడు  ఇలాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీ పైన ఆయన ఎందుకంత మొండి వైఖరిని పాటిస్తున్నాడనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.   అయితే అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ తెలంగాణ సీఎం అని సంబోధిస్తూ రేవంత్ రెడ్డి అనే పేరును మర్చిపోయాడు. ఆ విషయంలోనే రేవంత్ రెడ్డి చాలావరకు కోపానికి వచ్చినట్టుగా తెలుస్తోందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరి సీఎం రేవంత్‌ రెడ్డి ఏం అనుకుంటున్నారో..?



మరింత సమాచారం తెలుసుకోండి: